టీవీ నటి రేసీ గ్రీన్ లుక్
ఇప్పుడు దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో తన వెన్యూని ది బెస్ట్ గా సద్వినియోగం చేసుకుంటోంది.
టీవీ నటి నియా శర్మ సిజ్లింగ్ లుక్స్ బోల్డ్ ఫ్యాషన్ సెన్స్ గురించి పరిచయం అవసరం లేదు. ఈ భామ పలుమార్లు ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన ఫోటోషూట్లు మతులు చెడగొట్టాయి. ఇప్పుడు మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. నిజానికి నియా అభిమానులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాదు. ఇప్పుడు దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో తన వెన్యూని ది బెస్ట్ గా సద్వినియోగం చేసుకుంటోంది. ఇటీవల తన ఫ్యాషన్ గేమ్‌ను ఎలివేట్ చేసే హాటెస్ట్ ఫోటోషూట్ తో మతులు చెడగొట్టింది.
నియా తన లేటెస్ట్ ఫోటోషూట్ ని షేర్ చేసి దానికి ఆసక్తికర క్యాప్షన్ ని ఇచ్చింది.``ఏమీ లేదు! నేను ప్రపంచంలోని టాప్‌లో ఉన్నాను (బుర్జ్‌ఖలీఫా.... 154వ అంతస్తు)`` అంటూ నియా ఆనందం వ్యక్తం చేసింది. ఈ బ్యూటీ లేత ఆకుపచ్చ బ్యాక్‌లెస్ డ్రెస్ ని ధరించి కనిపించింది. నియా దుబాయ్ వీధుల్లో చెప్పులు లేకుండా నడుస్తున్న ఫోటోల బంచ్ ను కూడా షేర్ చేసింది.
నియా శర్మ 2010లో `కాళి ఏక్ అగ్నిపరీక్ష`తో టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఏక్ హజారోన్ మే మేరీ బెహనా హై వంటి షోలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఈ కార్యక్రమంలో క్రిస్టిల్ డిసౌజా, కరణ్ థాకర్, కుశాల్ టాండన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. రవి దూబే సరసన నటించిన జమై రాజా షోకి కూడా విపరీతమైన ప్రశంసలు పొందింది. నియా ఖత్రోన్ కే ఖిలాడీ -ఝలక్ దిఖలాజా వంటి రియాల్టీ షోలలో కూడా పాల్గొంది.
గత నెలలో నియా పరిశ్రమలో తన 13 సంవత్సరాల వేడుకను జరుపుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎమోషనల్ లెటర్ ని షేర్ చేసింది. ``టెలివిజన్ ప్రపంచంలో 13 అద్భుతమైన సంవత్సరాలు. అయ్యో! ఈ కేకులు పువ్వులు ప్రతి చిన్న పెద్ద సందర్భంలో.....! ఇవేవీ ఎప్పుడూ గుర్తుంచుకోలేదు లేదా లెక్కించలేదు... అని తెలిపింది.