బావ-బామ్మర్ది భలే హ్యాండ్ ఇచ్చారే!
సాధారణంగా సినిమా ప్రారంభమైన తర్వాత... సెట్స్ కి వెళ్లిన తర్వాత ఆగిపోవడం అన్నది దాదాపు జరగదు.
సాధారణంగా సినిమా ప్రారంభమైన తర్వాత... సెట్స్ కి వెళ్లిన తర్వాత ఆగిపోవడం అన్నది దాదాపు జరగదు. ఎందుకంటే అన్నీ అకే అనుకున్నాకే ఠెంకాయ కొడతారు. రెగ్యులర్ షూటింగ్ కి ఫిక్స్ అవుతారు. అందులోనూ అగ్ర హీరోల చిత్రాల విషయంలో ఇలా అస్సలు జరగదు. ఓ స్టార్ హీరో సినిమా కమిట్ అయ్యాడు? అంటే దాని వెనుక బోలెడంత కథ ఉంటుంది. ఒకవేళ ఆగిపోతే దాన్నో భంగపాటు గా భావిస్తుంటారు. అలాంటి సన్నివేశం చోటు చేసుకుంటే వాటిని బయటకు పొక్కకుండా చూసుకుంటారు. కానీ ఏదో రూపంలో ఆలస్యమైనా విషయం వెలుగులోకి వస్తుంది. అదీ వేరే సంగతి.
ఆ మధ్య ఓస్టార్ హీరో...స్టార్ డైరెక్టర్ సినిమా ఇలాగే ప్రారంభమైంది. అంత వరకూ ప్లాప్ ల్లేని ఆ డైరెక్టర్ ఆ హీరో కోసం ఎంతో కష్టపడి ఆ కథ సిద్దం చేసాడు. ఠెంకాయ కొట్టారు. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైది. కానీ ఇంతలోనే ఆసినిమా ఆగిపోయింది. అందుకు కారణం ఏటి? అన్నది ఇప్పటికీ మిస్టరీనే. సెట్స్ కి వెళ్లిన తర్వాత క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా? లేక బడ్జెట్ కారణంగా వెనకడుగు వేసారా? అన్నది తెలియదు గానీ! ఆ సినిమా ఆగిపోవడానికి కారణం ఏంటి? అన్నది ఇంతవరకూ తెలియదు.
తాజాగా అదే కుటుంబానికి చెందిన మరో హీరో ప్రాజెక్ట్ విషయంలో కూడా అలాగే జరిగింది. చాలా గ్యాప్ తర్వాత సదరు డైరెక్టర్ ఆ హీరోని కన్విన్స్ చేసి ఒప్పించాడు. సినిమా ప్రారంభమైంది. మంచి క్యాచీ టైటిల్ పెట్టారు. కొన్ని ప్రచార చిత్రాలు కూడా రిలీజ్ చేసారు. వాటికి మంచి హైప్ వచ్చింది. కట్ చేస్తే ఆ సినిమా కూడా ఆగిపోయింది. బడ్జెట్ ఓవర్ ది బోర్డ్ అవ్వడంతో అర్దంతరంగా ఆసినిమాని ఆపేసారని ప్రచారంలోకి వచ్చింది. మరి అసలు కారణం ఇదేనా? లేక ఇంకేదైనా ఉందా? అన్నది మాత్రం తెలియదు.
కానీ ఆగిపోయిన ఆ రెండు సినిమాల హీరోలు బంధువులు. వరుసకు బావ-బామ్మర్ది అవుతారు. ఈ సినిమా లు ఆగిపోవడంతో హీరోలకి ఇబ్బంది లేదు గానీ...దర్శకులు మాత్రం మళ్లీ వేరే హీరోని సెట్ చేసుకోవాల్సి వస్తోంది. అయితే ఓ హీరో మాత్రం హీరోని తానే సెట్ చేసి ఇచ్చాడు. అందుకు తానే బాధ్యత తీసుకున్నాడు. మరో హీరో మాత్రం ఇంకా ఆఛాన్స్ తీసుకునే స్థాయికి రాలేదు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు.