ప్ర‌పంచంలో నం.1 సంప‌న్న‌ న‌టుడు ఎవ‌రు?

టామ్ క్రూజ్, షారుఖ్ ఖాన్, డ్వేన్ జాన్సన్ లేదా జానీ డెప్ వంటి హెవీవెయిట్ పేర్ల‌ను వెన‌క్కి నెట్టి ప్రపంచంలోని అత్యంత ధనిక నటుడిగా ఫ్రాంఛైజీ చిత్రాల‌ న‌టుడు టైల‌ర్ పెర్రీ నిలిచారు.

Update: 2024-10-05 06:15 GMT

ప్ర‌పంచంలో అత్యంత సంప‌న్న న‌టుడు ఎవ‌రు? ఆదాయంలో నం1 స్టార్ ఎవ‌రు? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ల‌భించింది. అత‌డు భార‌త‌దేశంలో కానీ ఆసియాలో కానీ లేడు. అత‌డు ఒక అమెరిక‌న్ నటుడు. టామ్ క్రూజ్, షారుఖ్ ఖాన్, డ్వేన్ జాన్సన్ లేదా జానీ డెప్ వంటి హెవీవెయిట్ పేర్ల‌ను వెన‌క్కి నెట్టి ప్రపంచంలోని అత్యంత ధనిక నటుడిగా ఫ్రాంఛైజీ చిత్రాల‌ న‌టుడు టైల‌ర్ పెర్రీ నిలిచారు.


బ్లూమ్‌బెర్గ్ - ఫోర్బ్స్ వంటి మూలాధారాలను ఉదహరించిన ది డైలీ గార్డియన్ క‌థ‌నం ప్రకారం.. టైలర్ పెర్రీ నిజానికి ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్న మేల్ నటుడు.. అతడి నికర ఆస్తుల‌ విలువ 1.4 బిలియన్ డాల‌ర్లు. దీని విలువ సుమారు రూ. 11,500 కోట్లు. పెర్రీ.. హిట్ మేడియా ఫ్రాంచైజీలో మాబెల్ `మాడియా` సిమన్స్ పాత్రకు ప్రసిద్ధి చెందాడు. ఈ సిరీస్‌లో 12 లైవ్-యాక్షన్ సినిమాలు, 11 నాటకాలు, అనేక టీవీ ప్రదర్శనల ద్వారా తన సంపదను పెంచుకున్నాడు. హాస్యనటుడు జెర్రీ సీన్‌ఫెల్డ్ రెండవ స్థానంలో నిలిచినట్లు స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. 1 బిలియన్ డాల‌ర్ (సుమారు రూ. 8,200 కోట్లు) నికర ఆస్తుల‌ విలువను అత‌డు క‌లిగి ఉన్నాడు. ఇతర ప్రముఖ పేర్లలో డ్వేన్ జాన్సన్ 890 మిలియన్ డాల‌ర్లు (సుమారు రూ. 7,320 కోట్లు), షారుఖ్ ఖాన్ 870 మిలియన్ డాల‌ర్లు (దాదాపు రూ. 7,160 కోట్లు), టామ్ క్రూజ్ 800 మిలియన్ డాల‌ర్లు (సుమారు రూ. 6,600 కోట్లు) నిక‌ర సంప‌ద‌ల్ని కలిగి ఉన్నారు.

న‌టీమ‌ణుల్లో జామీ గెర్ట్జ్ 8 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 66,000 కోట్లు)తో కిరీటాన్ని కైవసం చేసుకుంటారని కూడా గార్డియ‌న్ క‌థ‌నం పేర్కొంది. లాస్ట్ బాయ్స్ సినిమాలో జామీ నటించిన‌ పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. బిలియనీర్లు టేలర్ స్విఫ్ట్, సెలీనా గోమెజ్ కూడా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు.

టైల‌ర్ పెర్రీ గొప్ప ప్ర‌యాణం:

బిలియనీర్ కావడానికి పెర్రీ ప్రయాణం కేవలం నటన మాత్రమే కాకుండా వివిధ వినోద మార్గాల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాడు. ఫోర్బ్స్ ప్రకారం.. పెర్రీ మేడియా ఫ్రాంచైజీ ఇతర ప్రాజెక్ట్‌ల సృష్టికర్త .. సినీ నిర్మాతగా పని చేయడం ద్వారా దాదాపు 320 మిలియన్ డాల‌ర్లు(దాదాపు రూ. 2,679 కోట్లు) సంపాదించారు. అతడి ఆర్థిక విజయానికి కీలకమైన అంశం ఏమిటంటే.. అతడు స్వతంత్రంగా కంటెంట్‌ను సృష్టించగలడు. మూడవ పక్ష స్టూడియోలపై ఆధారపడకుండా ఉండగలడు. అతడు మీడియా దిగ్గజం వ‌యాకామ్ CBSతో భాగస్వామి. ఇది అతనికి BET+ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో 25 శాతం వాటాను అందించింది. దీని విలువ 60 మిలియన్ డాల‌ర్లు (సుమారు రూ. 500 కోట్లు).

బ్రిటీష్ రాజ‌కుటుంబంతో క‌నెక్ష‌న్:

పెర్రీకి 300 మిలియన్ డాల‌ర్లు (దాదాపు రూ. 2,511 కోట్లు) నగదు, పెట్టుబడులు ఉన్నాయని రియల్ ఎస్టేట్ విలాసవంతమైన ఆస్తులలో 40 మిలియన్ డాల‌ర్లు (సుమారు రూ. 334 కోట్లు) కూడబెట్టారని ఈ క‌థ‌నం హైలైట్ చేసింది. ప్రిన్స్ హ్యారీ అతడి భార్య, మాజీ నటి మేఘన్ మార్క్లే ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్‌కు మకాం మార్చినప్పుడు అతని ఆస్తిలో ఒకదానిలో నివసించినందున పెర్రీ బ్రిటీష్ రాజ కుటుంబానికి కూడా కనెక్ట్ అయ్యాడని గార్డియ‌న్ క‌థ‌నం పేర్కొంది.

Tags:    

Similar News