కాక‌పుట్టిస్తోన్న హీరోల పొలిటిక‌ల్ గేమ్!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా పూర్తి స్థాయిలో రాజ‌కీయాలు చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు.బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్టు సీనీరాజకీయ వర్గాలు చెబుతున్నాయి

Update: 2023-07-17 06:45 GMT

సినిమా వేరు..రాజ‌కీయం వేరు అయినా! సినిమా వాళ్లు రాజ‌కీయం చేస్తే ఆ క్రేజ్ వేరుగా ఉంటుంది. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న హీరోలు పొలిటిక‌ల్ గేమ్ షురూ చేస్తే ఆ మ‌జా వేరుగా ఉంటుంది. అప్ప‌ట్లో ఎన్టీఆర్..జ‌య‌ల‌లిత సినిమా-రాజ‌కీయంగా ఎంత ఫేమ‌స్ అయ్యారో... ఆ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ తో జ‌నాల్లో తిర‌గ‌డం అంతే ఆస‌క్తిక‌రం. త‌దుప‌రి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప్ర‌జా స‌మ‌స్య‌లపై పోరాటానికి దిగ‌డం తాజా సినారాలో ఎంత ర‌స‌వ‌త్తరంగా మారిందో తెలిసిందే.

2024 ఎన్నిక‌లు స‌మీపిస్తోన్న నేప‌థ్యంలో కొన్ని నెల‌లుగా ప‌వ‌న్ ప్ర‌జ‌ల్లోనే తిరుగుతున్నారు. అధికార ప‌క్షాన్ని ఎండ‌గ‌డుతూ ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని తెర‌పైకి తెస్తున్నారు. ఇక ప‌వ‌న్ ప్ర‌భుత్వంపై ఏ రేంజ్ లో విరుచుకుప‌డుతున్నారో? రోజు చూస్తున్న‌దే. ఇక త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా పూర్తి స్థాయిలో రాజ‌కీయాలు చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే `మామన్న‌న్` సినిమాని త‌న చివ‌రి చిత్రంగా ప్ర‌క‌టించి ప్ర‌జా సేవ‌కు పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నారు.

ముఖ్య‌మంత్రి కుమారుడు కావ‌డంతో వార‌స‌త్వం కొన‌సాగించాల్సిన బాధ్య‌త ఉండ‌టంతో ఈ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే పాక్షికంగా ప్ర‌జ‌ల్లో ఉన్నా సినిమాలు కూడా చేయ‌డంతో పూర్తిస్థాయిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేక‌పోతున్నారు. అందుకే ఇక రాజీయాలే జీవితంగా ముందుకు సాగ‌బోతు న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల స‌మ‌యానికి ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ధిగా బ‌రిలోకి దిగినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

ఇక బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ కూడా త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్టు సీనీరాజకీయ వర్గాలు చెబుతున్నాయి. తన తల్లి- తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని సమాజ్ వాదీ పార్టీ తరపున ప్రయాగ్‌రాజ్ స్థానం నుంచి ఎంపీగా పోటీచేయనున్నారని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. యంగ్ పొలిటీష‌న్ గా అభిషేక్ ప్ర‌జ‌ల అవ‌స‌రాలు తీర్చ‌డానికి సంసిద్ద‌మ‌వు తున్న‌ట్లు వినిపిస్తోంది.

అభిషేక్ తండ్రి అమితాబ్ బచ్చన్ 1984లో ఇదే స్థానం నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు బరిలోకి దిగిన ఆయన లోక్‌దళ్ అభ్యర్థి హెచ్ఎన్ బహుగుణపై లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే అభిషేక్ తల్లి సమాజ్‌వాదీ పార్టీ నేత జయాబచ్చన్ ప్రస్తుతం యూపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. దీంతో అభిషేక్‌ను కూడా రంగంలోకి దింపాలని ఎస్పీ అగ్రనేతలు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా ప‌వ‌న్..ఉద‌య‌నిధి..అభిషేక్ పేర్లు ఒకేసారి రాజ‌కీయ సినారేలో వినిపించ‌డం ఆస‌క్తిక‌రం.

Tags:    

Similar News