ప్లాప్ సినిమా కోసం కాజోల్ సొంత నిర్ణ‌యం!

90వ ద‌శ‌కంలో రిలీజ్ అయిన 'సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు' అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే

Update: 2023-11-07 00:30 GMT

90వ ద‌శ‌కంలో రిలీజ్ అయిన 'సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు' అప్ప‌ట్లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. ఆల్ టైమ్ క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఏఎన్నార్..రోహిణి..మీనా..మీనా ప్రధాన పాత్ర‌ల్లో కాంతి కుమార్ తెర‌కెక్కించిన తాత‌-మ‌న‌వ‌రాలు స్టోరీ ఇప్ప‌టికీ సంచ‌ల‌న‌మే. ప్ర‌తీ స‌న్నివేశం ఎంతో హృద్యంగా తెర‌కెక్కించిన గొప్ప చిత్రం. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో 'ఉదార్ కీ జింద‌గీ' టైటిల్ తో కె.వి రాజు తెర‌కెక్కించారు.

జితేంద్ర‌..మౌష‌మీ ఛ‌ట‌ర్జీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించ‌గా మ‌న‌వ‌రాలి పాత్ర‌లో కాజోల్ న‌టించింది. అయితే తెలుగులో సాధించిన విజ‌యాన్ని హిందీలో మాత్రం సాధించ‌లేదు. తాజాగా ఆ సినిమా రిలీజ్ అయి 29 ఏళ్లు పూర్త‌వుతుంది. ఈ సంద‌ర్భంగా అందులో పాత్ర గురించి కాజోల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. 'కొన్ని సినిమాలు ప్రేక్ష‌కుల మ‌న‌సు గెలుచుకుపోవ‌చ్చు గానీ..న‌టీన‌టుల కెరీర్ ని మ‌లుపు తిప్పిన చిత్రాలుగా నిలుస్తాయి.

'ఉధార్ కీ జింద‌గీ' ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లో లేక‌పోయినా నా కెరీర్ ని మ‌లుపు తిప్పిన చిత్రంగా భావిస్తాను. ఆ సినిమా...అందులో పాత్ర నాకెంతో నేర్పింది. 20 ఏళ్ల వ‌య‌సులోనే సొంత నిర్ణ‌యం తీసుకుని చేసిన చిత్ర‌మ‌ది. చిత్రీక‌ర‌ణ ఓమ‌ర్చిపోని అనుభ‌వాన్నిచ్చింది. ఈ సినిమా ద్వారా జీవితంలో ఎలా మెరుగు ప‌డాలో తెలుసుకున్నాను' అని అంది. కాజ‌ల్ వ్యాఖ్య‌ల్ని బ‌ట్టి ఆసినిమా బాలీవుడ్ లో ఆశించిన ఫ‌లితం సాధించ‌న ప్ప‌టికీ వ్య‌క్తిగ‌తంగా ఆ చిత్రాన్ని ఎంత‌గా ఇష్ట‌ప‌డుతుందో అద్దం ప‌డుతుంది.

న‌టిగా కాజోల్ అప్పుడే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 'ఉద‌ర్ కీ జింద‌గి' కాజోల్ మూడ‌వ చిత్రం. అంత‌కు ముందు 'బేకుడీ'.. 'బాజీఘ‌ర్' చిత్రాల్లో న‌టించింది. ఆ అనుభవంతోనే ఉద‌ర్ కీ జింద‌గీలో అవ‌కాశం రావ‌డం స‌హా అందులో పాత్ర న‌చ్చ‌డంతో వెంట‌నే అంగీక‌రించింది.

Tags:    

Similar News