3 ముక్కల స్విమ్ డ్రెస్.. ఉర్ఫీ మైండ్ బ్లోయింగ్
తన డ్రెస్సింగ్ కు ప్రశంసలతో పాటు అనేక విమర్శలు కూడా ఎదుర్కొంటోంది.
బాలీవుడ్ బ్యూటీ, బిగ్ బాస్ ఫేమ్ ఉర్ఫీ జావెద్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయిన ఈ బ్యూటీ ఫోటోలు ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. వెరైటీ వెరైటీ కాస్ట్యూమ్స్ తో దిగిన పిక్స్ తోపాటు వీడియోలను షేర్ చేసుకుంటూ పాపులారిటీ పెంచుకుంటోంది. తన డ్రెస్సింగ్ కు ప్రశంసలతో పాటు అనేక విమర్శలు కూడా ఎదుర్కొంటోంది. కానీ వాటిని పట్టించుకోకుండా దూసుకుపోతుంటోంది.
చెప్పాలంటే.. ప్రస్తుత ఫ్యాషన్ వరల్డ్ లో ఆమె ఒక స్పెషల్ ఐకాన్. మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి అనుగుణంగా కొత్త కొత్త ట్రెండీ డ్రెస్సులు వేసుకుంటూ సెగలు పుట్టిస్తుంటోంది. కుర్రాళ్ళ గుండెల్లో అగ్గి రాజేస్తుంటోంది. మూవీ ఈవెంట్స్, టీవీ షోస్, అవార్డు ఫంక్షన్లకు స్పెషల్ డ్రెస్సులు వేసుకుని వస్తుంటుంది. అక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంటోంది. కెమెరాల ఫోకస్ అంతా ఆమె డ్రెస్ పైనే ఉంటుంది. అంతలా ఆమె డ్రెస్సింగ్ స్టైల్ కు ఫ్యాన్స్ ఉన్నారు.
ఇటీవల ఓ ఈవెంట్ కు ఈ బ్యూటీ.. బటర్ ఫ్లై డ్రెస్ వేసుకొని వెళ్లి అందంగా కనిపించింది. ఆ మ్యాజికల్ డ్రెస్ నెట్టింట వైరల్ గా మారగా.. స్టార్ హీరోయిన్ సమంత బ్యూటిఫుల్ ఉర్ఫీ అంటూ ఇన్ స్టా స్టోరీ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ తన మార్క్ డ్రెస్సింగ్ స్టైల్ కు వచ్చేసింది ఈ అమ్మడు. తాజాగా కొత్త పిక్స్ షేర్ చేసింది ఉర్ఫీ. మూడే మూడు ముక్కల బ్లూ కలర్ స్విమ్ డ్రెస్ వేసుకుని ఓ రేంజ్ లో స్కిన్ షో చేసింది.
ప్రస్తుతం వెకేషన్ లో ఉన్న ఉర్ఫీ.. గులాబీ పువ్వుల ఎమోజీలను క్యాప్షన్ గా ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేసి బయటకు వస్తున్న వీడియోతో పాటు పిక్స్ షేర్ చేసింది. ఒక్కసారిగా తన అందాలు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిన పిక్స్ కు ఓ రేంజ్ లో లైకుల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. ఉర్ఫీ స్కిన్ షో వేరే లెవల్ లో ఉందని కామెంట్లు పెడుతున్నారు. ఫ్యాషన్ కు బ్రాండ్ అంబాసిడర్ అని కొనియాడుతున్నారు.
హిందీ బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొని ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఉర్ఫీ.. ఆ తర్వాత పలు టీవీషోల్లో పాల్గొంది. ఏఎల్టీ బాలాజీలో ప్రసారమైన మేరీ దుర్గాలో ఆర్తిగా, బేపన్నాలో బెల్లాగా, పంచ్ బీట్ సీజన్ 2లో మీరాగా కనిపించి అదరగొట్టింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీతో ‘లవ్ సెక్స్ ఔర్ ధోకా 2’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. మరి ఈ బ్యూటీ సినీ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.