ప్ర‌స‌వం పెళ్లి కంటే పెద్ద పండ‌గ‌లా జ‌ర‌గాలి: ఉపాస‌న‌

రామ్ చరణ్ స‌తీమణి విలాసవంతమైన సౌక‌ర్యాల న‌డుమ ఆస్పత్రిలో క్లిన్ కారా కొణిదెలకు జన్మనివ్వడం గురించి ఓపెనైంది.

Update: 2024-09-24 11:04 GMT

ఎవ‌రైనా భార‌తీయ యువ‌తి ప్ర‌స‌వ స‌మ‌యంలో ఎలాంటి వాతావ‌ర‌ణంలో ఉండాలి? ఏం చేస్తే గ‌ర్భిణికి పురిటి నొప్పుల స‌మ‌యంలో ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు ఉపాస‌న కొణిదెల వ‌ద్ద స‌మాధానం ఉంది. ఉపాస‌న ఇదివ‌ర‌కూ త‌న తొలి బిడ్డ క్లిన్ కారాకు జ‌న్మ‌నిచ్చిన‌ప్పుడు ఎలాంటి అనుభూతికి లోనైందో వెల్ల‌డించింది.

రామ్ చరణ్ స‌తీమణి విలాసవంతమైన సౌక‌ర్యాల న‌డుమ ఆస్పత్రిలో క్లిన్ కారా కొణిదెలకు జన్మనివ్వడం గురించి ఓపెనైంది. ది నోడ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాద్‌లో తన ప్రసవ అనుభవం గురించి వివరంగా మాట్లాడింది. మన సమాజంలో పెళ్లి కంటే ప్రసవం చాలా పెద్ద పండ‌గ‌లా జ‌ర‌గాల‌ని నేను కోరుకుంటున్నాన‌ని ఉపాసన అంది.

నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఒక హోటల్ లా.. సొంత ఇంటి విలాసవంతమైన వాతావరణంలో డెలివరీ చేయాలనుకున్నాను. నాకు మాత్రమే ఎందుకు అలాంటి అనుభవం ఉండాలి? అంటే.. పెళ్లి కంటే ప్రసవం చాలా ముఖ్యమైనది.. ప్రజలు దీన్ని రొటీన్‌గా భావిస్తారు కానీ మహిళలు గర్భం దాల్చడానికి ఏమి చేస్తారో మీకు తెలియదు. గర్భస్థ స‌మ‌యం- ప్రసవానంతర సమయంలో ``పెళ్లి కంటే ఘ‌నంగా ఒక బిడ్డను కన‌డం సంబ‌రంలా ఉండాలని అనుకున్నాను`` అని ఉపాస‌న అన్నారు.

రామ్ చరణ్ - ఉపాసన దంప‌తులు జూన్ 20న హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌లో తమ పాప క్లిన్ కారా కొణిదెలకి స్వాగతం పలికారు. పెళ్ల‌యిన‌ 11 సంవత్సరాల తర్వాత ఈ జంట తమ మొదటి బిడ్డను స్వాగతించారు. వారి కుమార్తె పుట్టిన తరువాత కొణిదెల కుటుంబం ఆనంధానికి అవ‌ధుల్లేవ్. ఈ వేడుకను తమ ప్రియమైనవారితో సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి ఆ కుటుంబం వేచి ఉండ‌లేదు. చాలా ఇంటర్వ్యూలలో రామ్ చరణ్ తండ్రి అయినందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన కుమార్తె క్లిన్ కారాతో గడపడాన్ని ఎలా ఇష్టపడతాడో చ‌ర‌ణ్ రివీల్ చేసాడు.

ఉపాసన తన మాతృత్వం తొలి ఏడాది అనుభ‌వాన్ని ప్రతిబింబించే భావోద్వేగ వీడియోను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేసింది. వీడియోలో క్లిన్ కారా పుట్టిన అనంత‌రం నామకరణ వేడుక నుండి కొన్ని అంద‌మైన‌ క్షణాల విజువ‌ల్స్ కూడా ఉన్నాయి. రామ్ చరణ్ - ఉపాసన జంట 14 జూన్ 2012లో వివాహం చేసుకున్నారు.

Tags:    

Similar News