క్లీంకార పేరుకి ముందు..వెనుక ట్యాగులొద్దు! ఉపాసన
క్లీంకార రాకతో మెగా-కామినేని కుటుంబాల్లో కొత్త వెలుగులొచ్చాయి
క్లీంకార రాకతో మెగా-కామినేని కుటుంబాల్లో కొత్త వెలుగులొచ్చాయి. రామ్ చరణ్-ఉపాసనలతో పాటు ఇరుకుటుంబాల్లో సంతోషం నిండింది. ఇక మెగా అభిమానుల ఆనందానికైతే అవధుల్లేవ్. తాజాగా క్లీంకార పుట్టి గురువారంతో నెల రోజులు పూర్తవుతుంది. ఇదే రోజున ఉపాసన కూడా జన్మించారు. తల్లి-కుమార్తెలు ఒకే రోజు పుట్టడంతో కామినేని కుటుంబ సభ్యులు మరింత ఆనందంలో కనిపిస్తన్నారు. నెల రోజులు పూర్తయిన సందర్భంగా తాజాగా ఓవీడియో రిలీజ్ చేసారు.
మొదటి నెల బెస్ట్ మూవ్ మెంట్స్ అన్నింటిని ఈ వీడియోలో పొందు పరిచారు. చిరంజీవి..సురేఖ.. శోభాకామినేని.. అనీల్ కామినేని వీడియోలో భాగమయ్యారు. ఈ వీడియోని జోసెఫ్ ప్రతినిక్ డైరెక్ట్ చేసారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తను అనుభూతుల్ని పంచుకున్నారు. 'క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలో తెలియని టెన్షన్ మొదలైంది. అంతా సరిగ్గా జరగాలని ప్రార్ధించాం. అన్ని అనుకున్నట్లు జరగడంతో క్లీంకార ఈ లోకంలోకి అడుగు పెట్టింది.
పాప పుట్టిన మరుక్షణం నా ఆనందం మాటల్లో చెప్పలేనిది. పాప పుట్టడానికి పట్టిన తొమ్మిది నెలల సమయం నుంచి పుట్టిన వరకూ ప్రతీది బెస్ట్ మూవ్ మెంట్' అన్నారు. ఉపాసన మాట్లాడుతూ.. 'మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాలని కోరుకున్నాం.
ఆమె పేరుకు ముందు వెనుక..ఎలాంటి ట్యాగులు ఇవ్వకండి. ఇలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలి. పిల్లల పెంపకంలో ఇవెంతో ముఖ్యమైనవి. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి.
అందరూ సంతోషంగా ఉండే సమయానికి విలువ ఇవ్వాలి. అభిమానులు.. స్నేహితులు.. సన్నిహితు లు..కుటుంబ సబ్యులు చూపిస్తోన్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞు రాలిని' అని అన్నారు. క్లీంకార పేరు వెనుక చాలా చరిత్రే ఉంది. భారత్ లోని ఏపీ..తెలంగాణ..కర్ణాటక.. ఒడిస్సా ప్రాంతాల్లో నివసిస్తోన్న చెంచు జాతి నుంచి స్పూర్తి పొంది క్లీంకారగా నామకరణం చేసారు.
ఆ జాతి ద్రావిడ సంస్కృతిలో భాగం. వారి సంస్కృతి సంప్రదాయాల్లో గొప్పతనం..విలువలే చరణ్-ఉపాసన దంపతుల ముద్దుల కుమార్తెకి ఆ పేరు పెట్టడానికి కారణమయ్యాయి. ఈ పేరు చిరంజీవి ఎంతో ఇష్టంగా భావిస్తున్నారు. పాపాయి కి సంబంధించిన ప్రతీ అప్ డేట్ చిరంజీవి స్వయంగా అభిమానులకు అందజేస్తోన్న సంగతి తెలిసిందే.