అత్తమ్మ తో అత్త అత్తమ్మతో కోడలు సరసాలు!
ఆ కుటుంబాన్ని ఎప్పుడెప్పుడు అలా చూస్తామా? అని మెగా అభిమానలు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు
'మా లొగిలిలో పండేదంతా పున్నమే.. మా జాబిలికి ఏడాదంతా పున్నమే..ఈ ఇంటికి మా కంటికి కను దీపం ఈ రూపం.. ప్రేమకు ప్రతీరూపం అనే పాట వేసుకోవాల్సిందే ఎప్పుడు మెగా ఫ్యామిలీ బాండింగ్ చూసినా! ఆ కుటుంబం పండగలు...పబ్బాలు..పెళ్లిలు వచ్చాయంటే కుటుంబంతా ఒకే చోట చేరి ఎంతో గ్రాండ్ గా వేడుకను సెలబ్రేట్ చేస్తుంటారు. పిల్లలు..పెద్దలు..అత్తలు కొడళ్లు..కొడుకులు..అన్నదమ్ములు...బావమరిది..ఇలా మెగా ఫ్యామిలీ మధ్య అన్యోన్యత ఎంతో అందంగా చూడ చక్కగా ఉంటుంది.
ఆ కుటుంబాన్ని ఎప్పుడెప్పుడు అలా చూస్తామా? అని మెగా అభిమానలు అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. సెలబ్రిటీల్లో ఈ క్రేజ్ కేవలం మెగా ఫ్యామిలీకే సొంతం అనడంలో అతిశయోక్తి లేదు. అందులో అందరూ నటులే కాబట్టి! అభిమానుల్లో ఆ రకమైన ఎగ్జైట్ మెంట్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. తాజాగా ఉపాసన అత్తమ్మ సురేఖ పచ్చడి వీడియో ఒకటి షేర్ చేసి మరోసారి మెగా అభిమానుల నోట పువ్వులు పూయించారు. కొత్తమామిడి కాయలు రావడంతో సురేఖ స్వయంగా పచ్చడి పెట్టే పనిలో ఉన్నారు.
ఆవిడతో పాటు ఇంట్లో పనివారు కూడా ఉన్నారు. అప్పుడే ఉపాసన దగ్గరకొచ్చి ఉపాసన క్యా బోల్ రహే అంటూ అడిగింది. దాంతో నాకు హిందీ అసలే రాదు అని నవ్వుతూ పనుల్లో మునిగిపోయారు సురేఖ. అలాగే ఇంటికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్‌ను పలుకరిస్తూ.. హాయ్ అంటీ.. వెలకమ్ టూ అత్తమ్మ కిచెన్ అంటూ మిగతా వారితోనూ ఉపాసన మాట కలిపారు. ఇక సురేఖ అత్తగారు పెద్దావిడ అంజనా దేవి కుర్చీలో కుర్చుని రిలాక్స్ అవుతున్నారు. ఉపాసన ఆవిడ దగ్గరకు వెళ్లి.ఏంటి ఇంత సీరియస్ గా ఉన్నారు? అంటే సీరియస్ ఏమీ లేదు.
పనిలేక ఇలా కూర్చొన్నాను అని అంటారు ఆ పెద్దవిడ. అయితే మీ కోడలు పచ్చడి సరిగ్గా చేయడం లేదా? అని ఉపాసన అంటే?..నీవు ఇంటికి కోడలు పిల్లవు ఉన్నావ్ గా అంటూ ఆ పెద్దవిడ సమాధానం ఇస్తారు. ఈ మొత్తం వీడియోని స్వయంగా ఉపాసన షూట్ చేసి నెట్టింట రిలీజ్ చేసారు. అదిప్పుడు వైరల్ గా మారింది.