బిడ్డ కోసం అండానికి బీమా చేయించాలి: ఉపాసన
ఈరోజుల్లో మాతృత్వం కోసం బిడ్డను కనడం కోసం అండా(గుడ్లు)లను బీమా చేయించాలని కూడా ఉపాసన అన్నారు.
ఉపాసన కామినేని కొణిదెల.. పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ భార్య. హెల్త్ కేర్ రంగంలో నిష్ణాతురాలు. ఇటీవలే ఉపాసన తన కుమార్తె క్లిన్ కారా కొణిదెలకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బిడ్డను కన్న తర్వాత తన జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకుంటుందో ఉపాసన తాజా ఇంటర్వ్యూలో ఓపెనైంది.
తన భాగస్వామి రామ్ చరణ్ నుండి తనకు లభించిన తిరుగులేని మద్దతు సంరక్షణ గురించి ఉపాసన ప్రస్తావించింది. ఒక తల్లిగా పనిలో నేను ఇంతకుముందులా నిరంతరం బిజీగా ఉండటం నాకు చాలా పెద్ద యుద్ధం. నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నేను దానిలో రాణించబోతున్నానని నాకు తెలుసు! అని ఉపాసన అన్నారు. ఈరోజుల్లో మాతృత్వం కోసం బిడ్డను కనడం కోసం అండా(గుడ్లు)లను బీమా చేయించాలని కూడా ఉపాసన అన్నారు.
ఉపాసన మాట్లాడుతూ..''కార్పొరేట్ ప్రపంచంలో మహిళలు వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో చాలా మార్పులతో ప్రయాణించాల్సి ఉంటుంది. దీనికోసం వారు రోజంతా చాలా కష్టపడుతున్నారు. భారతదేశంలోని మహిళలకు సులభతరమైన ఉద్యోగ విధానం ఉండేలా సవరణలు చేయాల''ని ఆమె కార్పొరేట్ ఇండియాను కోరారు. POSH కమిటీల సహాయంతో సౌకర్యవంతమైన ప్రసూతి సెలవుపై కంపెనీలతో కలిసి పని చేస్తోంది. మహిళలు బీమా ద్వారా తమ అండాల (గుడ్ల)ను కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నాను''అని ఉపాసన అన్నారు.
34 ఏళ్ల ఉపాసన పని ప్రదేశం సౌకర్యవంతంగా మహిళలకు అనుకూలంగా ఉండేలా వివిధ ప్రాజెక్ట్‌లపై పని చేస్తున్నారు. మహిళలు పిల్లలను కనడం కంటే ఏదైనా ఉద్యోగాన్ని ఎంచుకుని ఉంటే, వారు పాకెట్ మనీతో సరిపెట్టుకోలేరు. మీరు పిల్లలను కనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు...దానికి తగినంత ధనవంతులు అయినప్పుడు మహిళగా మీకు.. దేశం పురోగతికి సహాయపడుతుంది.. అని అన్నారు. బిడ్డను కనాలని అనుకున్నప్పుడు నేను నా అండాల (గుడ్ల)ను కూడా కాపాడాను. రామ్ నేను సౌకర్యవంతమైన స్థాయికి వచ్చాక బిడ్డను కనే ఎంపిక చేసుకున్నామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను...! అని అన్నారు.
రామ్ చరణ్ - ఉపాసన 2012లో వివాహం చేసుకున్నారు. ఈ జంట కాలేజీ రోజుల్లో డేటింగ్ ప్రారంభించారు. 2008లో ఒకరికొకరు ఓపెనయ్యారు. రెండు సంవత్సరాల పాటు డేటింగ్ చేసిన తర్వాత 2011లో నిశ్చితార్థం చేసుకున్నారు. వారు 2023లో తమ ఆడబిడ్డ క్లిన్ కారా కొణిదెలకి స్వాగతం పలికారు.