పెద్ద కొడలిగా వరుణ్ పెళ్లి బాధ్యతలు ఉపాసనకా?
భర్త చరణ్ బిజీగా ఉంటాడు కాబట్టి తన వైపు నుంచి అన్ని రకాల బాధ్యతలు ఉపాసన తీసుకుని మందుకెళ్తున్నారు.
మెగా ఇంట ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ షురూ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్-లావణ్య జోడీల పెళ్లి సందర్భంగా ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో ఈ వేడుకలు మొదలయ్యాయి. పెళ్లి తేది బయటకు రాలేదు గానీ.. వేదిక ఎక్కడ? ఎప్పుడు ఎలా అనే విషయాలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇటలీలోని టుస్కానీ నగరం అందుకు వేదికైంది. ఈ వివరాలు అన్నింటిని మెగా కోడలు ఉపాసన రివీల్ చేస్తున్నారు.
ఆ రకంగా మెగా కోడులు వరుణ్ పెళ్లికి సంబంధించి కొన్ని రకాల బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. భర్త చరణ్ బిజీగా ఉంటాడు కాబట్టి తన వైపు నుంచి అన్ని రకాల బాధ్యతలు ఉపాసన తీసుకుని మందుకెళ్తున్నారు. ఇక కళ్యాణ మండపం వద్ద వేదిక డెకరేషన్... వివాహానికి సంబంధించిన అన్ని రకాల డిజైన్స్ ని ఉపాసన స్వయంగా దగ్గరుండి ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. డెకరేషన్ కి సంబంధించిన కొన్ని డిజైన్స్ ని ఉపాసన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేసారు.
ఆ రకంగా అభిమానుల అభిప్రాయాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇక ఉపాసన ఫ్యాషన్ ఎంపికలు కూడా యూనిక్ గా ఉంటాయి. డిజైన్స్ విషయంలో ఆమెని స్పెషలిస్ట్ గా చెబుతారు. న్యూ ట్రెండ్ ని బట్టి ఆమె సెలక్షన్ అద్భుతంగా ఉంటుందని ఓ సందర్భంలో చరణ్ కూడా అన్నారు. ఇన్ స్టాలో తన ఇష్టాన్ని.. ఫ్యాషన్ ఎంపికల గురించి స్టోరీలు రాస్తుంటారు. అందుకే వెడ్డింగ్ కి సంబంధించి డిజైన్స్ బాధ్యతలు అమెకి అప్పగించినట్లు తెలుస్తోంది.
ఇటీవల మెగాస్టార్ ఇంట్లో జరిగిన వేడుక డిజైన్ ఎవరి టేస్ట్ ? అన్నది తెలియాలి. అక్కడ డెకరేషన్ కూడా వావ్ అనిపించేలా ఉంది. ఉన్న స్పేస్ లోనే అద్దుతమైన నేచుర్ బ్యూటీని చూపించారు. ఇంకా వెడ్డింగ్ కార్డు డిజైన్ ఇతర వ్యవహరాల్లోనూ ఉపాసన ముందుండే అవకాశం ఉంది. నవంబర్ మొదటి వారంలో ఈ వివాహం జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. దీనిపై మెగాఫ్యామిలీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.