రోషన్ మేక పాన్ ఇండియా.. ఎంతవరకు వచ్చిందంటే..

ఇక రిలీజ్ డేట్ కి ముహూర్తం ఖరారు చేశారు. వృషభ సినిమాకు ది వారియర్ రైజ్ అనే టాగ్యు ను జోడించారు. శనయ కపూర్, జహ్ర ఖాన్ కూడా కీలకపాత్రలలో పాటిస్తున్నారు

Update: 2023-10-13 16:48 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మొదటి సినిమా పెళ్లి సందD కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. అందులో డ్యాన్స్ తోనే ఈ కుర్ర హీరో బాగా ఎట్రాక్ట్ చేశాడు. అయితే రోషన్ ఇప్పుడు ఏకంగా ఫ్యాన్ ఇండియాలో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.


అది కూడా మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. వృషభ అనే ఆ సినిమాకు సంబంధించిన అనేక రకాల గాసిప్స్ గత కొంత కాలంగా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగానే తెరపైకి న తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ముంబైలో ప్రారంభమైన న్యూ షెడ్యూల్ అప్డేట్ ఇచ్చారు.


ఇక రిలీజ్ డేట్ కి ముహూర్తం ఖరారు చేశారు. వృషభ సినిమాకు ది వారియర్ రైజ్ అనే టాగ్యు ను జోడించారు. శనయ కపూర్, జహ్ర ఖాన్ కూడా కీలకపాత్రలలో పాటిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్ అలాగే ఏవిఎస్ స్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు నందకిషోర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

తెలుగు మలయాళం తెరకెక్కుతున్న ఈ సినిమాను హిందీ కన్నడ తమిళ భాషలలో కూడబ్విడుదల చేయనున్నారు. ఇక ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన రెండవ షెడ్యూల్ను నేడు ముంబైలో స్టార్ట్ చేశారు. ఇక సినిమా షూటింగ్ ను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఫైనల్ గా సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయంలో కూడా ఈ దసరాకు క్లారిటీ ఇవ్వబోతున్నారు.

ఇక ప్రత్యేకంగా ముంబైలో షెడ్యూల్లో పాల్గొన్న తర్వాత చిత్ర సభ్యులందరూ కూడా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చారు. ఇక అందులో రోషన్ స్టైలిష్ లుక్ కూడా హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపును అందుకోవాలి అనుకుంటున్నాడు. ఇక మోహన్ లాల్ లాంటి స్టార్ యాక్టర్తో అతనికి అవకాశం దొరకడం లక్కీ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాకు స్టార్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. అందులో కొంతమంది హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ సమకూరుస్తున్నారు.

Tags:    

Similar News