ట్యాక్స్ ఎగ్గొట్టనందుకు ప్రశంసా పత్రం!
అయితే తాజాగా చంద్రుని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ప్రశంసలతో ముంచెత్తింది.
'కేజీఎఫ్' రేంజ్ లో రిలీజ్ అయిన కన్నడ చిత్రం `కబ్జా` ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా పాన్ ఇండియాని షేక్ చేస్తుందనుకున్నారుగానీ! బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. 'కేజీఎఫ్' సినిమానే మళ్లీ తిప్పి తీసినట్లు ఉందని విమర్శలు ఎదుర్కుంది. దీంతో సినిమాకి భారీగ నష్టాలు తప్పలేదు.
ఉపేంద్ర , సుదీప్, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో ఆర్ చంద్రు స్వీయా దర్శకత్వంలో నిర్మించారు. అయితే తాజాగా చంద్రుని కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ప్రశంసలతో ముంచెత్తింది. అతన్ని నిజాయితీ గల నిర్మాతగా గుర్తించి ప్రశంసా పత్రాన్ని రిలీజ్ చేసింది. ఈ సినిమాతో నష్టపోయినా నిర్మాత విధిగా కేంద్రానికి చెల్లించాల్సిన అన్ని రకాల పన్నుల్ని సకాలంలో చెల్లించారు.
ఎక్కడా ఎలాంటి బకాయిలు పెట్టకుండా, ఎలాంటి తప్పుడు మాటలు చెప్పకుండా నిజాయితీగా దేశ పౌరుడిగా తన విధిని తాను నిర్వర్తించారు. ఎలాంటి స్వలాభానికి పోకుండా? నిజాయితీగా ఉన్నందుకు ఆయన్ని అలా ప్రశంసా పత్రంతో సత్కరించింది. అయితే కేంద్రం నుంచి ఇలా ప్రశంసా పత్రం అందు కున్న అతి కొద్ది నిర్మాతల్లో చంద్రు ఒకరు కావడం విశేషం. ఎంతో నిజాయితీగా ఉంటే గానీ ఇలాంటి పత్రాన్ని ప్రభుత్వం రిలీజ్ చేయదు.
ఆ రకంగా చంద్రు ప్రభుత్వ విశ్వాసాన్ని పొందారు. మిగతా నిర్మాతలు కూడా చంద్రు లాంటి వారిని స్పూర్తిగా తీసుకుని సకాలంలో పన్నులు చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీ సిద్దేశ్వర్ ఎంటర్ ప్రైజస్ బ్యానర్ పై `కబ్జా` చిత్రాన్ని నిర్మించారు. దాదాపు 120 కోట్లతో నిర్మించిన సినిమా 34 కోట్ల వసూళ్లను సాధించింది.