పాతికేళ్లలో ఈ వసూళ్లు చూడలేదు..!

1000 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న పుష్ప 2 మేనియా ఢిల్లీలో అదిరిపోయింది.

Update: 2024-12-12 12:03 GMT

1000 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న పుష్ప 2 మేనియా ఢిల్లీలో అదిరిపోయింది. దాని గురించి చెబుతూ ఢిల్లీ డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. పుష్ప 2 ఆడిస్తున్న డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్ పుష్ప 2 ఢిల్లీ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. గత ఆరు రోజులుగా తమ స్క్రీన్స్ అన్ని హౌస్ ఫుల్స్ తో ఇదివరకు ఎప్పుడు చూడని రెవిన్యూ అందిస్తున్నాయని వారు చెప్పారు.

పుష్ప 2 సినిమాను ఢిల్లీలో అనీల్ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆయన నుంచి పంపిణీ చేసిన వారంతా కూడా ఢిల్లీ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఈ క్రమంలో తమ థియేటర్స్ లో సినిమా ఆడుతున్న విధానం ఆక్యుపెన్సీ, కలెక్ట్ చేస్తున్న వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పారు. ముఖ్యంగా పాతికేళ్ల అనుభవం ఉన్న అషుతోష్ అగర్వాల్ పుష్ప 2 చేస్తున్న వసూళ్ల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈ రేంజ్ కలెక్షన్స్ చాలా తక్కువ సినిమాలకు చూశానని. 25 ఏళ్ల కెరీర్ లో ఇలాంటి వసూళ్లు రేర్ అని అన్నారు అషుతోష్ అగర్వాల్. ఆయనే కాదు ఢిల్లీ ఇంకా నార్త్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడా పుష్ప 2 చేస్తున్న సంచలన విజయాల గురించి మాట్లాడారు. ఇలాంటి గొప్ప సినిమా అందించినందుకు హీరో అల్లు అర్జున్ ని డైరెక్టర్ సుకుమార్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు.

అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప 2 సినిమా ఆరు రోజుల్లోనే 1004 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజ్ ముందు నుంచి ఉన్న బజ్ ని క్యారీ చేస్తూ సినిమా అదరగొట్టేసింది. సినిమ మొదటి ఆట నుంచి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో వసూళ్లు అదిరిపోతున్నాయి. ముఖ్యంగా నార్త్ సైడ్ పుష్ప 2 బీభత్సం సృష్టిస్తుంది. అక్కడ స్ట్రైట్ సినిమాల రికార్డులను తిరగరాస్తూ ఎన్నో రికార్డులను సృష్టిస్తుంది. పుష్ప 1 సూపర్ హిట్ కాగా ఆ క్రేజ్ తోనే పుష్ప 2 వచ్చింది. ఐతే పుష్ప 2 కి బాలీవుడ్ నుంచి ముందు నుంచి సూపర్ బజ్ ఏర్పడింది. ప్రచార చిత్రాలు కూడా మంచి క్రేజ్ తెచ్చుకోగా సినిమా అనుకున్న రేంజ్ లో ఉండటంతో వసూళ్లు అదిరిపోతున్నాయి.

Tags:    

Similar News