ఆ బ్యూటీ ముఖం పొట్ల‌కాయ‌లా ఉబ్బిందేంటి?

ఇన్ స్టా సంచ‌ల‌నం ఉర్పీ జావేద్ గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. సినిమా హీరోయిన్ కంటే ఎక్కువ పాపుల‌ర్ అయిన బ్యూటీ ఉర్పీ.

Update: 2024-06-03 10:16 GMT

ఇన్ స్టా సంచ‌ల‌నం ఉర్పీ జావేద్ గురించి ప‌రిచయం అవ‌స‌రం లేదు. సినిమా హీరోయిన్ కంటే ఎక్కువ పాపుల‌ర్ అయిన బ్యూటీ ఉర్పీ. త‌న‌దైన శైలి వినూత్న‌మైన డిజైనింగ్ దుస్తుల్లో సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవ్వ‌డం అమ్మడి ప్ర‌త్యేక‌త‌. ఉర్పీ ఇన్ స్టా కొచ్చిందంటే? అక్క‌డ చ‌ర్చ త‌ప్ప‌నిస‌రి. తాజాగా అమ్మ‌డు మ్యాక‌ప్ లెస్ ఫేస్ పిక్ ఒక‌టి రిలీజ్ చేసి అంద‌ర్నీ షాక్ కి గురిచేసింది. మ్యాక‌ప్ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ముఖ‌మంతా పొట్ల కాయ‌లా ఉబ్బిన‌ట్లు క‌నిపిస్తుంది.


దీంతో ఆమె ముఖానికి ఏమైంది అంత‌లా ఉబ్బిందంటూ చ‌ర్చ మొద‌లైంది. ఆమె ఫిల్లర్‌లను తప్పుగా పొందుతోందని అందుకే అంతలా ముఖం ఉబ్బంద‌ని కొందరంటుంటే? ఏదో పెద్ద అనారోగ్యంతోనే బాధపడు తున్నారని మరికొంత మంది భావిస్తున్నారు. ఈ విధ‌మైన ప్ర‌చారం పీక్స్ కి చేర‌క ముందే ఉర్పీ జావేద్ దానిపై వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. తన ముఖం ఉబ్బినది ఫిల్లర్‌ల వల్ల కాదని, ఆమె తీవ్రమైన అలెర్జీ కార‌ణంగా వాపు వ‌చ్చిన‌ట్లు తెలిపింది.

రెండు రోజుల‌కు ఒక‌సారి ఇలా జ‌రుగుతుంద‌ని, ఆ రోజు ఉబ్బిన ముఖంతోనే నిద్ర లేస్తాన‌ని తెలిపింది. ఆ కార‌ణంగా ఎంతో అసౌక‌ర్యానికి గుర‌వుతున్న‌ట్లు చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి ఇమ్యునోథెరపీ చేయించుకున్నప్పటికీ అలెర్జీ కార‌ణంగా రియాక్ష‌న్ ఎదుర్కుంటుందిట‌. అలాగే నెగిటివ్ కామెంట్ల‌పై అస‌హ‌నాన్ని వ్య‌క్తం చేసింది. అన‌వ‌స‌ర‌మైన స‌ల‌హాలు ఇవ్వ‌డం మానేసి ఇలా జ‌రిగినందుకు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని సానుభూతి కోరుకుంది.

ఆమె ఇలా స్పందించ‌డంతో ఆమెకి ఒళ్లంతా కూడా ఎలెర్జీ ఉన్న మాట వాస్త‌వ‌మేనా? అన్నడౌట్ కొడుతోంది. ఒంటిమీద దుస్తులు ప‌డ‌కుండా ఇలా వైవిథ్యంగా ఉండ‌టానికి కార‌ణం ఏంటి? అంటే త‌న‌కు బ‌ట్ట‌లు ప‌డ‌వ‌ని.. వేసుకుంటే దుర‌ద‌..ద‌ద్ద‌ర్లు పుడ‌తాయ‌ని అందుకే ఇలా ఉంటాన‌ని ఓసంద‌ర్భంలో చెప్పిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇప్పుడు రెండు రోజుల‌కు ఒక‌సారి ముఖం ఉబ్బుతున్న‌ట్లు తెలిపిందంటే? నిజంగానే ఒళ్లంతా అలెర్జీ స‌మ‌స్య ఉందా? అనిపిస్తుంది.

Tags:    

Similar News