హాయ్ అబ్బాయిలు నేను చ‌నిపోలేదు!

ఇన్ స్టాలో బెడ్ పై ప‌క్క‌కు తిరిగి ప‌డుకున్నో ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోని ఉద్దేశించి ఉర్పీ జావేద్ ఏమ‌ని రాసిందంటే

Update: 2024-02-04 10:11 GMT

సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం ప‌రాకాష్ట‌కు చేరింది. బ్ర‌తికి ప్రాణాల‌తో ఉన్నా స‌రే చ‌నిపోయామ‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారంటే? ఎంత‌కు తెగిస్తున్నారు అన్న‌ది అద్దం ప‌డుతుంది. అందుకు మోడ‌ల్ కం న‌టి పూన‌మ్ పాండే ఉదంతం రెండు..మూడు రోజులుగా ఎంత సంచ‌ల‌మైందో తెలిసిందే. ప‌బ్లిసిటీ కోసం ఇప్ప టివ‌ర‌కూ ఎవ‌రూ అనుస‌రించ‌ని స‌రికొత్త స్ట్రాట‌జీని అనుస‌రించి బోలెడంత పాపులారిటీ సంపాదించింది.

అంత‌కు మించి అదే ప్రేక్ష‌కుల‌తో అక్షింత‌లు వేయించుకున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా త‌గుదున‌మ్మా అంటూ ఉర్పీ జావేద్ కూడా ఇప్పుడు ముందుకొచ్చిందిలా. ఇన్ స్టాలో బెడ్ పై ప‌క్క‌కు తిరిగి ప‌డుకున్నో ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోని ఉద్దేశించి ఉర్పీ జావేద్ ఏమ‌ని రాసిందంటే? హాయ్ అబ్బాయిలు నేను చనిపోలేదు. హ్యాంగోవర్‌ గురించి అవగాహన కల్పిస్తున్నాను. మద్యపానం చేస్తున్నప్పుడు మొద‌టి రోజు మీకు చాలా సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

 

ఎలాంటి అసౌక‌ర్యానికి గురి కారు. కానీ మరుసటి రోజు మీరు చనిపోయినట్లు అనిపిస్తుంది. కానీ మీరు నిజంగా చనిపోరు అని ఓ పుర్రె ఎమోజీని పోస్ట్ చేసింది. అంటే ఇక్క‌డ పూన‌మ్ పాండే స‌న్నివేశాన్ని ఉర్పీ జావేద్ గుర్తు చేయ‌డం అన్న మాట‌. మ‌హిళ‌ల్లో క్యాన్స‌ర్ అవ‌గాహ‌న కోసం చనిపోయాన‌ని పూన‌మ్ చెప్పుకో వ‌డం..ఆ త‌ర్వాత నేను బ్ర‌తికే ఉన్నాను అని క్లారిటీ ఇవ్వ‌డం తేలిసిందే. అదే కాన్సెప్ట్ ని తీసుకుని ఉర్పీ జావేద్ మ‌ద్యం బాబుల గురించి ఇలా ఓ ఫ‌న్సీ పోస్ట్ చేసింది.

ఇది వాళ్ల గురించైతే ప‌ర్వాలేదు. పూన‌మ్ పాండే ని ఇమిటేట్ చేసిన‌ట్లు చేయ‌డం? అంటే రంగంలోకి ఆమె దిగితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఇక ఉర్పీ జావెద్ త‌క్కువేం కాదు. ఇన్ స్టాలో అమ్మ‌డు వింతైన డిజైన్ దుస్తుల‌తో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డం..ప‌బ్లిసిటీ ద‌క్కించుకోవ‌డం ఆమె ప్ర‌త్యేక‌త‌. ఇందులో ఉర్పీ త‌ల పండిన పండితురాలే. న‌టి కాక‌క‌పోయినా కేవ‌లం ఇన్ స్టాలో ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారంటే కార‌ణం త‌న‌లో ఆ ర‌క‌మైన క్రియేటివిటీనే.

Tags:    

Similar News