#NBK109 మాన్‌స్ట‌ర్ అబ్రార్‌కి ఊర్వ‌శి వెల్‌కమ్

ఊర్వ‌శి వ్యాఖ్య ఇలా ఉంది. "మా #NBK109 ఫిల్మ్ ఫ్యామిలీకి లార్డ్ #బాబీడియోల్‌ను స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది" అని రాసింది. సన్నీ డియోల్ సరసన 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

Update: 2023-12-30 04:22 GMT

హేట్ స్టోరి 4- గ్రాండ్ మ‌స్తీ సినిమాల‌తో అగ్గి రాజేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వ‌శి రౌతేలా ఇటీవ‌ల టాలీవుడ్ లో వ‌రుస చిత్రాల‌కు క‌మిట‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు మెగాస్టార్ చిరంజీవి, గోపిచంద్ స‌హా ప‌లువురి చిత్రాల్లో ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో ఆక‌ట్టుకుంది. ఇప్పుడు నంద‌మూరి న‌ట‌సింహం బాలకృష్ణ తదుపరి చిత్రంలో ఊర్వ‌శి న‌టిస్తోంది. ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర కోసం యానిమ‌ల్ ఫేం బాబిడియోల్ ని చిత్ర‌బృందం ఎంపిక చేసుకుంది. ఇంత‌లోనే బాబీకి వెల్ కం చెబుతూ ఊర్వ‌శి రౌతేలా అస‌లు విష‌యం త‌న అనుచ‌రుల‌కు తెలిపింది.


యానిమల్ ఘ‌న‌ విజయంతో దూసుకెళ్తున్న నటుడు బాబీ డియోల్.. సూపర్ స్టార్ నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం NBK109లో నటించబోతున్నారని ఊర్వ‌శి వెల్ల‌డించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఊర్వశి రౌతేలా ఈ థ్రిల్లింగ్ ప్రకటనతో పాటు తాను- బాబీ డియోల్ క‌లిసి ఉన్న ఫోటోల‌ను షేర్ చేసారు. ఈ ఫోటోలలో ఊర్వశి - బాబీ ఓ విమానంలో పోజులివ్వ‌డం క‌నిపిస్తోంది. ఆ ఇద్ద‌రూ సినిమా షూట్‌కు వెళుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.


ఊర్వ‌శి వ్యాఖ్య ఇలా ఉంది. "మా #NBK109 ఫిల్మ్ ఫ్యామిలీకి లార్డ్ #బాబీడియోల్‌ను స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది" అని రాసింది. సన్నీ డియోల్ సరసన 'సింగ్ సాబ్ ది గ్రేట్' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తనను సినిమా ప్రపంచంలోకి ప్రవేశపెట్టినందుకు డియోల్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలుపుతూ ఊర్వ‌శి ఇలా రాసింది. "నన్ను సినిమా ప్రపంచంలో ప్రవేశపెట్టినందుకు డియోల్ కుటుంబానికి కృతజ్ఞతలు. ఇప్పుడు #NBK109లో మీతో స్క్రీన్ ని షేర్ చేస్కోవ‌డానికి వేచి ఉండలేకపోతున్నాను. #హ్యాపీ న్యూ ఇయర్ గాయ్స్" అని రాసింది. ఈ ఫోటోల‌పై నంద‌మూరి అభిమానులు అనూహ్య స్పంద‌న‌లతో విరుచుకుప‌డ్డారు. "ఈ జంటను ఒక చిత్రంలో చూడటం చాలా సంతోషక‌రం. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాను" అని ఒక అభిమాని రాసారు.


బాబీ న‌టించిన 'యానిమల్' 2023లో అత్యంత విజయవంతమైన చిత్రాలలో ఒకటి. డిసెంబర్ 1న విడుదలైన ఈ చిత్రానికి 'యానిమల్ పార్క్' అనే సీక్వెల్ ఉంటుంద‌ని సందీప్ వంగా టీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. సీక్వెల్లో ర‌ణ‌బీర్ ద్విపాత్రాభినయం చేసే అవకాశం ఉంది. ఇటీవ‌ల మేక‌ర్స్ T-సిరీస్ ఇన్‌స్టాగ్రామ్ లో సీక్వెల్‌ను ధృవీకరించారు. ప్రభాస్ నటిస్తున్న 'స్పిరిట్' .. అల్లు అర్జున్‌తో ఒక సినిమా కోసం.. అలాగే యానిమ‌ల్ పార్క్ .. సందీప్ రెడ్డి వంగాతో కలిసి మూడు చిత్రాలకు నిర్మాత‌లుగా కొన‌సాగుతున్నామ‌ని T-సిరీస్ ప్రకటించింది.

Tags:    

Similar News