యూఎస్ బాక్సాఫీస్: రజనీ ఊచకోత.. చిరు మాత్రం..
సూపర్ స్టార్ రజనీకాంత్-మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు ఒకరోజు గ్యాప్ లో బాక్సాఫీస్ వార్ లో దిగిన సంగతి తెలిసిందే
సూపర్ స్టార్ రజనీకాంత్-మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు ఒకరోజు గ్యాప్ లో బాక్సాఫీస్ వార్ లో దిగిన సంగతి తెలిసిందే. రజనీ జైలర్ గా రాగా.. చిరు భోళాశంకర్ గా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అయితే ఈ రెండు చిత్రాల్లో జైలర్ బ్లాక్ బస్టర్ హిట్ అయి రికార్డ్ వసూళ్లను అందుకుంటుండగా.. భోళాశంకర్ మాత్రం భారీ డిజాస్టర్ ను అందుకుని డీలా పడిపోయింది.
అయితే ఈ రెండు సినిమాల రిజల్ట్ ఓవర్సీస్ లోనూ ఇలానే ఉంది. యూఎస్ బాక్సాఫీస్ ముందు కూడా జైలరే సరికొత్త రికార్డ్ దిశగా వసూళ్లను అందుకుంటూ ముందుకెళ్తోంది. కానీ భోళాశంకర్ మాత్రం అక్కడ కూడా తుస్సు మనినిపించి చిరు కెరీర్ లోనే దారుణమైన పరాభవాన్ని చూపించింది.
జైలర్ విషయానికొస్తే.. యూఎస్ బాక్సాఫీస్ ముందు తమిళ-తెలుగు వెర్షన్స్ లో రిలీజ్ అయింది. ఓపెనింగ్ వీకెండ్ లో సుమారు 4 మిలియన్ డాలర్లను అందుకుంది. అంతకుముందు ఓపెనింగ్ వీకెండ్ కు సంబంధించిన కేవలం తమిళ సినిమాల్లో ఈ మార్క్ వసూళ్లను అందుకున్న ఏకైక చిత్రం పొన్నియిన్ సెల్వన్ మాత్రమే. ఇప్పుడా ఫీట్ ను జైలర్ అందుకుంది. రజనీకి గత చిత్రాల్లో తొలి వీకెండ్ లో హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ కబాలి మాత్రమే. అది 3.9మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది. అంటే ఇప్పుడు జైలర్ మూవీ రజనీ కెరీర్ లోని బెస్ట్ ఎవెర్ ఓపెనింగ్ సినిమాగా నిలిచింది.
ఈ రెస్పాన్స్ చూస్తుంటే.. యూఎస్ తమిళ సినిమాల్లో ఇప్పటివరకు హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ గా ఉన్న పొన్నియిన్ సెల్వన్ రికార్డ్ ను జైలర్ అధిగమించడం ఖాయం అని అనిపిస్తోంది. ఈ జైలర్ చిత్రం ఆగస్ట్ 9 బుధవారం 947, 117 డాలర్లను, గురువారం 622, 352 డాలర్లను, శుక్రవారం 767,497 డాలర్లను, శనివారం 979,978డాలర్లను, ఆదివారం సుమారు 690కే డాలర్లను అందుకుంది. మొత్తంగా 4 మిలియన్ డాలర్ల మార్క్ వసూలు చేసింది.
భోళాశంకర్ విషయానికొస్తే.. చిరు కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా నిలిచిన ఆచార్య కన్నా మరింత పెద్ద భారీ డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది. ఆచార్యకు యూఎస్ బాక్సాఫీస్ టోటల్ థియేట్రికల్ రన్ టైమ్ లో 985కే డాలర్లు వచ్చాయి. అంటే 1 మిలినయ్ డాలర్లకు కాస్త తక్కువ. అంతకుముందు గాడ్ ఫాదర్ కు ఫుల్ రన్ టైమ్ లో 1,283,527 డాలర్లు వచ్చాయి. కానీ భోళాశంకర్ పరిస్థితి అలా లేదు. హాఫ్ మిలియన్ కూడా చేరుకోవడం కష్టమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
ఈ చిత్రానికి ప్రీమియర్స్ 303కే డాలర్స్ రాగా, గురువారం 313,804 డాలర్లు, శుక్రవారం 83,842 డాలర్లు, శనివారం 42, 733 డాలర్లు, సండే 15కే డాలర్లు మాత్రమే వసూలు చేసింది. అంటే రోజురోజుకు దారుణంగా పడిపోతూ వచ్చింది. ఆదివారం అయితే చిన్న సినిమాలకు వచ్చే వసూళ్లను కూడా అందుకోలేక చేతులెత్తేసే పరిస్థితి కనిపించింది. మొత్తంగా తొలి వీకెండ్ లో 455కే డాలర్లను మాత్రమే వసూలు చేసింది.