పవన్ మాస్ కాంబో,. ఇప్పట్లో అయ్యే పనిలా లేదు
ఇక చివరికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు మధ్యలో చాలా లాంగ్ బ్రేక్ కావడంతో మరొక రీమేక్ ప్రాజెక్టు స్టార్ట్ చేయాల్సి వచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కరోనా కంటే ముందే సినిమా చేయాలని అనుకున్న విషయం తెలిసిందే. అయితే కాలం ఎంత గడుస్తున్నా కూడా ఊహించని పరిస్థితులు ఈ కాంబినేషన్ కు అడ్డుపడుతూనే ఉన్నాయి. మొదట అనుకున్న కథ చివరికి క్యాన్సల్ అవ్వగా మరొక కథను సెట్స్ పైకి తీసుకు రావాల్సి వచ్చింది. ఒక విధంగా పవన్ కళ్యాణ్ ఉన్న బిజీ షెడ్యూల్ కు అతని డైరెక్టర్లు సపోర్ట్ చేస్తున్న విధానంకు నిజంగా మెచ్చుకుని తీరాల్సిందే.
ఎంతో ఓపికతో పవన్ కళ్యాణ్ కోసం చాలా కాలం పాటు ఎదురుచూస్తున్నారు. ఆయన పొలిటికల్ ప్లానింగ్ కు తగ్గట్టుగానే సినిమా షూటింగ్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక దర్శకుడు హరీష్ శంకర్ అయితే చాలా కాలం పాటు పవన్ కళ్యాణ్ కోసమే ఎదురు చూశాడు. ఇక చివరికి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కు మధ్యలో చాలా లాంగ్ బ్రేక్ కావడంతో మరొక రీమేక్ ప్రాజెక్టు స్టార్ట్ చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఫ్యాన్స్ ల్ చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో చాలా బిజీగా ఉన్నాడు. కూటమి విజయంతో ప్రభుత్వం ఏర్పడితే మాత్రం జూన్ వరకు కూడా మరింత బిజీగా ఉంటారు.
అయితే మరోవైపు పవన్ కళ్యాణ్ OG సినిమాను కూడా పూర్తి చేయాల్సి ఉంది. అలాగే లిస్టులో హరిహర వీరమల్లు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక ముందుగా అయితే సుజిత్ తో ఓజి ప్రాజెక్టును తొందరగా ఫినిష్ చేసి అనుకున్న డేట్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నారు.
ఆ తర్వాత హరిహర వీరమల్లు కూడా చాలా తొందరగా పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమాకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో హరిష్ శంకర్ కు పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకడం కష్టమే. అయితే ఇదే టైంలో మళ్లీ పవన్ కళ్యాణ్ కోసం టైమ్ వృధా చేయకుండా హరీష్ పీపుల్స్ వీడియో ఫ్యాక్టరీ లోనే మరొక సినిమా చేయాలని అనుకుంటున్నాడు.
అదే సంస్థ మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నా విషయం తెలిసిందే. ఇక హరీష్ మెగాస్టార్ కాంబినేషన్ ను సెట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మళ్లీ పవన్ కళ్యాణ్ మిగతా సినిమాల్లో బిజీగా ఉంటే అప్పటి వరకు హరీష్ శంకర్ చిరంజీవి సినిమాతో బిజీ అవుతాడు. దీన్ని బట్టి చూస్తే పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్టు ఇప్పట్లో స్టార్ట్ అయ్యే ఆవకాశం తక్కువే. 2025 లోనే మళ్ళీ పట్టాలు ఎక్కవచ్చు.