'ఉస్తాద్..' యాక్షన్ మోడ్‌లో పవన్ కల్యాణ్
ఇందులో పవన్‌కల్యాణ్ గన్ పట్టుకుని స్టైలిష్‌గా కూర్చొని కనిపించారు. 'ది ఉస్తాద్ ఈజ్ ఇన్ యాక్షన్' అని టీమ్ క్యాప్షన్ రాసుకొచ్చింది.
ఓ వైపు పాలిటిక్స్.. మరోవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు పవర్ స్టార్ పవన్‌కల్యాణ్. ఒక్కో సినిమాకు కొంత సమయాన్ని కేటాయిస్తూ వరుస సినిమా షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. అయితే రీసెంట్గా ఆయన పుట్టినరోజు నుంచి వరుసగా సినిమా అప్డేట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన నటిస్తున్న 'ఉస్తాద్ భగత్‌సింగ్' సినిమాకు సంబంధించి మరో కొత్త అప్డేట్ వచ్చింది.
పవన్ కల్యాణ్ ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టారు. యాక్షన్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. నేడు(సెప్టెంబర్ 7) నుంచి ఆయనపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని తెలిసింది. పవర్ ప్యాక్డ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తాజాగా ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో పవన్‌కల్యాణ్ గన్ పట్టుకుని స్టైలిష్‌గా కూర్చొని కనిపించారు. 'ది ఉస్తాద్ ఈజ్ ఇన్ యాక్షన్' అని టీమ్ క్యాప్షన్ రాసుకొచ్చింది.
ఇకపోతే ఈ సినిమాను పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి హరీశ్ శంకర్ డైరెక్షన్ చేస్తున్నారు. 'గబ్బర్ సింగ్' లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత పవన్-హరీశ్ శంకర్ కాంబోలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో పవన్‌కల్యాణ్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి సందడి చేయనున్నారు.
ఇంకా ఈ సినిమాలో యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. అశుతోష్ రానా, నవాబ్ షా, కేజీయఫ్ ఫేమ్ అవినాశ్, గౌతమి, నర్రా శ్రీను, నాగా మహేశ్, టెంపర్ వంశీ సహా పలువురు నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. కే దశరథ్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అయనంక బోస్ డీఓపీ, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైనర్ ఆనంద్ సాయి, పోరాట సన్నివేశాలను రామ్ లక్ష్మణ్.. ఇలా హైక్లాస్ టెక్నికల్ టీమ్ సినిమా కోసం పనిచేస్తోంది.
ఇకపోతే ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ అందుకుని నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ పవన్ కల్యాణ్ తనదైన మ్యానరిజంతో చెప్పిన డైలాగ్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది.