పిక్‌టాక్ : వైట్ డ్రెస్‌లో అందాల వాణి
కెరీర్ ఆరంభంలో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.
కపూర్ ఫ్యామిలీకి చెందినప్పటికీ వాణి కపూర్ బాలీవుడ్‌లో సక్సెస్‌ను సొంతం చేసుకోవడంకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో ఈ అమ్మడికి అంత ఈజీగా అవకాశాలు దక్కలేదు. 2013లో శుద్ద్ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఫిలిం ఫేర్ అవార్డును అందుకుంది. యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వాణి కపూర్ రెండో సినిమాను సైతం అదే బ్యానర్‌లో చేసింది. నాని హీరోగా రూపొందిన ఆహా కళ్యాణం సినిమాతో వాణి కపూర్ 2014లో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కెరీర్ ఆరంభంలో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు.
కెరీర్ ఆరంభించిన దాదాపు నాలుగు ఐదు సంవత్సరాలకు ఈ అమ్మడి స్టార్ డం పెరిగింది. ముఖ్యంగా ఈ అమ్మడు బాలీవుడ్‌లో చేసిన 'వార్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో అక్కడ నుంచి వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకు పోతుంది. లేటు వయసులో బిజీ అయింది అంటూ కొందరు ఈమె గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఆకట్టుకునే అందంతో దూసుకు పోయే ఈ అమ్మడు వరుసగా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఈ అమ్మడు సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ వస్తోంది. తాజాగా ఈ అమ్మడు హోమ్ గర్ల్ అంటూ ఈ ఫోటోలు షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో ఆకట్టుకునే అందంతో వాణి కపూర్ మరోసారి కన్నుల విందు చేసింది. సాధారణంగానే సన్నగా నాజూకుగా అందంగా కనిపించే ఈ అమ్మడు మరోసారి అంతకు మించి అన్నట్లుగా ఆకట్టుకుంది. వాణి కపూర్ సోషల్ మీడియాలో వైట్ డ్రెస్‌లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతటి అందంకు కాస్త లేట్‌గా అయినా మంచి అవకాశాలు దక్కుతున్నాయని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రైడ్ 2తో పాటు మరికొన్ని సినిమాలు సైతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ ఏడాదిలో ఈమె నుంచి కనీసం మూడు లేదా నాలుగు సినిమాలు వస్తాయని తెలుస్తోంది. ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నా కూడా మంచి పాత్రలు, కథలను చూసి మరీ ఎంపిక చేసుకుంటుంది. సినిమాల ఎంపిక విషయంలో ఈ అమ్మడు తగిన జాగ్రత్తలు పాటిస్తూ మెల్లగా సినిమాలు చేస్తూ వస్తోంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్‌లు, ఇతర షోల్లోనూ ఈ అమ్మడు ఆకట్టుకుంటూ ఉంది.