పిక్‌టాక్ : బేబీ ఎంత కష్టపడుతుందో చూడండి

తాజాగా వైష్ణవి చేసిన ఈ వర్కౌట్‌ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. క్యూట్‌గా ఉన్న వైష్ణవి ఎంత కష్టపడుతుందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Update: 2025-01-25 11:10 GMT

యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌ చేయడంతో పాటు, టాలీవుడ్‌ సినిమాల్లో అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చిన వైష్ణవి చైతన్య 2023లో బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్షేషన్‌ క్రియేట్‌ చేసింది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఆ సినిమాలో వైష్ణవి చైతన్య నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావు అమ్మడు అంటూ ఆ సమయంలోనే వైష్ణవికి ఫ్యాన్‌ అయిన వారు చాలా మంది ఉన్నారు. బేబీ సినిమాతో ఒక్కసారిగా ఆఫర్లు ఇబ్బడి ముబ్బడిగా ఈ అమ్మడికి రావడం ప్రారంభం అయ్యింది. కానీ ఆచితూచి ఈమె సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఉంది.


బేబీ సినిమాతో వచ్చిన గుర్తింపుతో గత ఏడాది 'లవ్‌ మీ' సినిమాతో వచ్చింది. దిల్‌ రాజు ప్రొడక్షన్‌ నుంచి వచ్చిన ఆ సినిమా పర్వాలేదు అనిపించింది. అంతే కాకుండా మరోసారి వైష్ణవి నటిగా మంచి పేరు సొంతం చేసుకుంది. చూడ్డానికి సన్నగా నాజూకుగా కనిపించే వైష్ణవి చైతన్య సోషల్‌ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడంతో పాటు, అప్పుడప్పుడు ఇలా వర్కౌట్ వీడియోలను, ఫోటోలను సైతం షేర్‌ చేస్తూ వస్తోంది. తాజాగా వైష్ణవి చేసిన ఈ వర్కౌట్‌ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. క్యూట్‌గా ఉన్న వైష్ణవి ఎంత కష్టపడుతుందో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


ఈసారి వైష్ణవి ట్రైనర్‌ రాజ్ సోషల్‌ మీడియా ద్వారా ఈ ఫోటోలను షేర్‌ చేశాడు. మూడు సంవత్సరాల నుంచి మీకు ట్రైనింగ్‌ ఇస్తున్నాను. అందరికంటే మీరు ఎక్కువ కష్టపడే వ్యక్తి. శిక్షణలో చాలా ఇబ్బందులు పెట్టినా మీరు ఎప్పుడూ సానుకూలంగానే తీసుకుని దానికి తగ్గట్లుగా రెడీ అవుతూ వస్తున్నారు. ఫిట్‌ నెస్ విషయంలో మీకు ఉన్న శ్రద్ద నిజంగా అద్భుతం. నేను ఇంత అందమైన అమ్మాయికి శిక్షణ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని కూడా సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాడు. ఈ ఫోటోలు వైష్ణవి చైతన్య చాలా సన్నగా నాజూకుగా కనిపిస్తుంది. అయినా వర్కౌట్స్ ఎందుకు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు.


సన్నగా ఉన్నంత మాత్రాన వర్కౌట్స్‌ చేయకూడదని లేదు. ఫిజికల్‌గానే కాకుండా మెంటల్‌గానూ స్ట్రాంగ్‌గా మారడం కోసం చాలా మంది వర్కౌట్స్ చేస్తారు. తన అందం కాపాడుకోవడంతో పాటు, ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండటం కోసం వర్కౌట్స్ చేస్తూ ఉండవచ్చు. హీరోయిన్స్‌ అంటే అంతా నాజూకుగా ఉంటారని అనుకుంటారు. కానీ వారు అందుకోసం చాలా కష్టపడాల్సి ఉంటుందని వైష్ణవి పడుతున్న కష్టంను చూస్తే అర్థం అవుతుంది. వైష్ణవి చైతన్య ప్రస్తుతం జాక్‌ సినిమాతో పాటు టైటిల్ ఫిక్స్ కానీ మరో సినిమాలోనూ నటిస్తోంది. ఈ ఏడాదిలోనే ఆ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Tags:    

Similar News