బేబీ 'వైష్ణవి'.. తస్మాత్ జాగ్రత్త
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా బేబి
టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా బేబి పేరే వినపడుతుంది. చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ఇది. వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా టైటిల్ పాత్రలో నటించింది. విరాజ్ మరో కీలక పాత్రలో నటించారు. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న 'కలర్ ఫొటో' సినిమాకు కథ అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన సాయి రాజేష్ నీలం ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎస్‌కెఎన్ నిర్మించిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా, బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ మూవీ హిట్ అవ్వడానికి హీరోయిన్ పాత్రను మలచిన విధానమే కారణం. ప్రేమ పేరిట ఇద్దరు అమ్మాయిలను మోసం చేస్తుంది. చివరకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. రియల్ లైఫ్ లో కూడా చాలా మంది ఇలానే చేస్తున్నారు అంటూ చాలా మంది అబ్బాయిలు ఈ స్టోరీని తమకు కనెక్ట్ చేసుకున్నారు. అందుకే, ఈ మూవీ ఈరోజు అంత పెద్ద హిట్ అయ్యింది.
అయితే, ఇలాంటి సినిమాలు రావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో ఆర్ఎక్స్ 100 సినిమా కూడా ఇంచు మించు ఇలానే ఉంటుంది. ఈ బేబీ మూవీలో వైష్ణవి చైతన్య ఏవిధంగా అయితే, బోల్డ్ సీన్స్ లో ఎలాంటి అభ్యంతరం లేకుండా నటించిందో, ఆర్ఎక్స్ 100 లో పాయల్ కూడా అలానే చేసింది. కానీ, ఆ సినిమా తర్వాత అందరూ సూపర్ అంటూ ప్రశంసించారు. పాయల్ నటనకు అందరూ ఫిదా అయిపోయారు. కానీ, తర్వాత పాయల్ కెరీర్ అద్భుతంగా మారింది ఏమీ లేదు.
ఇంకా, పాయల్ చూసినప్పుడల్లా ఆర్ఎక్స్ 100 గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత కూడా ఆమెకు ఎక్కువగా బోల్డ్ పాత్రలే వచ్చాయి. కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేకపోయింది. అంతెందుకు అర్జున్ రెడ్డి మూవీ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆ మూవీ సక్సెస్ కి హీరో విజయ్ ఎంత కృషి చేశాడో, హీరోయిన్ షాలినీ కూడా అంతే కష్టపడింది. కానీ, ఈ మూవీ తర్వాత విజయ్ కెరీర్ టర్న్ తీసుకున్నట్లుగా, షాలినీ కెరీర్ సెట్ అవ్వలేదు.
షాలినీ అయితే మరీ దారుణం, ఎంత ప్రయత్నించినా, ఆమెకు ఆ తర్వాత కెరీర్ లో పెద్ద గుర్తింపు రాలేదు. మరి బేబి వైష్ణవి పరిస్థితి ఏంటి? ఆమె కెరీర్ కూడా ఈ ఒక్క మూవీతో ఆగిపోతుందా లేక, ఆ బోల్డ్ సీన్స్ నెగిటివిటీ తగ్గి, మంచి హీరోయిన్ గా క్లివ్ అవుతుందో లేదో చూడాలి.
నిజానికి, ఆ అమ్మాయిలో మంచి నటి ఉంది. ఎలాంటి పాత్రలైనా నటించగలను అని మొదటి సినిమాతోనే నిరూపించుకుంది. ఇక వైష్ణవి కూడా తొందరగానే బేబీ మార్క్ పోయేలా పాత్రలు సెలెక్ట్ చేసులోవాలి. లేకుంటే పాయల్, షాలిని తరహాలో సక్సెస్ కొట్టినా స్ట్రగుల్ అవ్వక తప్పదు. మరి బేబీ ఇంపాక్ట్ వలన ఆమెకు దర్శకనిర్మాతలు ఎలాంటి అవకాశాలు ఇస్తారో చూడాలంటే, కొంత కాలం ఆగాల్సిందే.