వాలెంటైన్స్ డే బాక్సాఫీస్.. సాలీడ్ కలెక్షన్స్
తెలుగు ప్రేక్షకులు ఒక సినిమాను లవ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద ప్రభావం ఎలా ఉంటుందో మరోసారి అర్థమయింది
తెలుగు ప్రేక్షకులు ఒక సినిమాను లవ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద ప్రభావం ఎలా ఉంటుందో మరోసారి అర్థమయింది. కంటెంట్ నచ్చితే మాత్రం రీ రిలీజ్ సినిమాలను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని ఇటీవల కాలంలో చాలా సినిమాలు రుజువు చేశాయి. దానికి టైమ్ కూడా బాగా కలిసి రాకాలి. ఇక ప్రేమికుల రోజు బాక్సాఫీస్ వద్ద సందడి గట్టిగానే కనిపించింది.
స్పెషల్ గా వచ్చిన ఓయ్ సినిమాకు కూడా సాలీడ్ రెస్పాన్స్ దక్కడం విశేషం. అంతే కాకుండా మరో వింటేజ్ లవ్ స్టోరీ సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక వీటితోపాటు కొత్త సినిమా ఊరు పేరు భైరవ కూడా ప్రీమియర్స్ ద్వారా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది.
కంటెంట్ నచ్చితే సినిమాలకు కలెక్షన్స్ ఏవిధంగా ఉంటాయో ఈ సినిమాలు రుజువు చేశాయి. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ఓయ్ సినిమా అప్పుడెప్పుడో విడుదలైనప్పుడు ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. యావరేజ్ టాక్ అందుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ రీ రిలీజ్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద 1.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం.
ఇక సూర్య సన్నాఫ్ సినిమా కూడా ఆగస్టు 14న మరోసారి రిలీజ్ అయింది. ఇంతకు ముందు ఈ సినిమాను ఒకసారి రీ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు రీ రీ రిలీజ్ కు 25 లక్షల గ్రాస్ రావడం విశేషం. ఇక సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన కూడా ఈ శుక్రవారం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సినిమాకు మంచి టాక్ రావాలి అని చిత్ర నిర్మాతలు ప్రీమియర్స్ తో ప్రయోగాలు చేశారు.
అయితే ఈ ప్రీమియర్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. గురువారం నైట్ షోలు చాలావరకు హౌస్ హౌస్ ఫుల్ అయ్యాయి. నిన్న ఒక్క రోజే దాదాపు 1.1 కోట్ల క్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది. దీన్నిబట్టి సినిమాకు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక విధంగా ఆడియన్స్ కంటెంట్ కు కనెక్ట్ అయితే బాక్సాఫీస్ వద్ద ఎల్లప్పుడూ సందడిగా ఉంటుంది అని ఈ సినిమాలు రుజువు చేశాయి.