బెడ్ రూమ్ సీన్ పై వాణిభోజన్ కామెంట్!
రెండు పడవల ప్రయాణం కన్నా ఒకే దానిపై గురి పెడితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావించిన వాణి కోలీవుడ్ లోనే వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది.
వాణీ భోజన్ టాలీవుడ్ కి సుపరిచితమే. `మీకు మాత్రమే చెప్తా` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమ్మడికి తొలి సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ కోలీవుడ్ చిత్రం `ఓ మై కడవలే`తో మాత్రం బాగా పాపులర్ అయింది. అప్పటి నుంచి కోలీవుడ్ లోనే సినిమాలు చేస్తోంది. రెండు పడవల ప్రయాణం కన్నా ఒకే దానిపై గురి పెడితే లక్ష్యాన్ని చేరుకోవచ్చని భావించిన వాణి కోలీవుడ్ లోనే వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటోంది.
దాదాపు 13 ఏళ్లగా ప్రయత్నాలు చేస్తుంది గానీ అమ్మడు మాత్రం ఇంకా గోల్ రీచ్ కాలేదు. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తోంది. వాటితోనైనా సరైన బ్రేక్ వస్తుందని ఆశిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా అమ్మడు గ్లామర్ సహా బోల్డ్ సన్నివేశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వ్యక్తిగతంగా తానకెదురైన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. అవసరం లేకపోయినా కొంత మంది దర్శకులు బోల్డ్ సన్నివేశాలు..బెడ్ రూమ్ సన్నివేశాలు ఇరికించాలని చూస్తారు.
నా బెడ్ రూమ్ సీన్ తీయాలని గతంలో ఓ దర్శకుడు ఇలా ప్లాన్ చేసాడు. నిజానికి అక్కడ సీన్ లో బెడ్ రూమ్ లో పడుకుని నటించేంత అవసరం లేదు. కానీ దర్శకుడు పట్టు బట్టాడు..అవసరం లేదని భావించడంతో అలాంటి సన్నివేశంలో నటించని నిర్మొహ మాటంగా చెప్పేసాను. నిజానికి ఆ సీన్ గురించి నాకు ముందుగా చెప్పి ఉంటే? నటించేదాన్ని ఏమో! కానీ స్పాట్ కి వెళ్లిన తర్వాత అప్పటికప్పుడు బెడ్ రూమ్ సీన్ చేయాలని డిమాండ్ చేసారు దీంతో చేయనని కరాఖండీగా చెప్పేసాను.
కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం కాదు. నా డ్రీమ్ మంచి పాత్రలు..నటకు ఆస్కారం ఉన్న రోల్స్ చేయాలని....డబ్బుల కోసం బోల్డ్ సినిమాలు చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి ఆలోచన కూడా రానివ్వను` అంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.