నువ్వు దొరకడం నా అదృష్టం

అతడు మంచి మగాడికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

Update: 2024-12-17 13:01 GMT

తమిళ్ స్టార్ శరత్‌ కుమార్ వారసురాలు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఇటీవల పెళ్లి పీటలు ఎక్కిన విషయం తెల్సిందే. ప్రేమించిన నికోలయ్‌ సచ్‌దేవ్‌ని వివాహం చేసుకున్న వరలక్ష్మి శరత్‌ కుమార్ ఇన్నాళ్లు భర్త గురించి పెద్దగా మాట్లాడలేదు. కానీ పెళ్లి తర్వాత అతడి మొదటి పుట్టిన రోజు కావడంతో తన ప్రేమ మొత్తాన్ని చూపిస్తూ సోషల్‌ మీడియా ద్వారా ఒక వీడియోను షేర్‌ చేసింది. ఆ వీడియోలో వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ తనకు భర్తగా నికోలయ్‌ సచ్‌దేవ్‌ లభించడం అదృష్టం అంది. అతడు మంచి మగాడికి ప్రత్యక్ష ఉదాహరణ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.


నికోలయ్‌ సచ్‌దేవ్‌ బర్త్‌డే సందర్భంగా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ మాట్లాడుతూ... ఈ ఏడాది నాకు అత్యంత స్పెషల్‌. చాలా స్పీడ్‌గా ఈ ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాదిలో ఏం జరిగింది అనే విషయాలను వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా విషయాలు జరిగాయి. అన్ని మధుర జ్ఞాపకాలుగా మిగిలాయి. నిన్ను ఎంత ప్రేమిస్తున్నాను అనేది మాటల్లో చెప్పలేను. నువ్వు నన్ను నీ కంటే అధికంగా ప్రేమిస్తున్నందుకు నేను అదృష్టవంతురాలిని. మగాడు ఎలా ఉండాలి, మొగుడు ఎలా ఉండాలి అనేదానికి నువ్వు మంచి ఉదాహరణ. ప్రతి విషయంలోనూ నువ్వు నాపై చూపించే కేరింగ్‌ ఎప్పటికీ మరచిపోలేను.

ఒక్క క్షణం నువ్వు నన్ను వదిలి పెట్టి ఉండటం లేదు. నీలాంటి భర్త లభించడం నా అదృష్టం అని చెప్పుకుంటాను. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి చోట నువ్వు నాతో ఉన్న ప్రతి క్షణం చాలా సంతోషంగా ఉంటుంది. నువ్వు నాతో ఉంటే చాలు, అంతకు మించి నిన్ను ప్రత్యేకంగా నేను అడగను, హ్యాపీ బర్త్‌ డే మై వరల్డ్‌ బెస్ట్‌ హస్పెండ్‌ అంది. వరలక్ష్మి తన భర్త గురించి చెప్పిన విషయాలు అతిశయోక్తిగా అనిపించలేదు, ఆమెకు మంచి భర్త లభిచింనందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులు కామెంట్స్‌ చేస్తూ నికోలయ్‌కి హ్యాపీ బర్త్‌డే అంటూ విషెష్‌ చెబుతున్నారు.

హీరోయిన్‌గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఈమధ్య కాలంలో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలతో పాటు, ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆకట్టుకునే అందంతో పాటు మంచి నటన ప్రతిభ కనబర్చే ఈ అమ్మడు హీరోయిన్‌గా సినిమాలు చేయకుండా ఎందుకు నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తుందని కొందరు అంటారు. కానీ తనకు వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌లో బెస్ట్‌గా కనిపించడం కోసం, తనలోని నటిని చూపించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తాను అంటూ వరలక్ష్మి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News