నేను కోరుకోని పెళ్లి జరుగుతుంది..!
సీనియర్ నటుడు శరత్ కుమార్ నట వారసురాలు వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా ఇప్పటికే తెలుగు మరియు తమిళనాట మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.
సీనియర్ నటుడు శరత్ కుమార్ నట వారసురాలు వరలక్ష్మి శరత్ కుమార్ నటిగా ఇప్పటికే తెలుగు మరియు తమిళనాట మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. హీరోయిన్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ద్వారా టాలీవుడ్ లో మంచి పేరును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
ఇటీవలే వరలక్ష్మి శరత్ కుమార్ తన వివాహ నిశ్చితార్థ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం ద్వారా అంతా కూడా సర్ ప్రైజ్ అయ్యారు. ఒక వైపు నటిగా బిజీగా ఉంటూనే మరో వైపు కొత్త జీవితంలో అడుగు పెట్టబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ... నికోలయ్ సచ్‌దేవ్ తోవివాహ నిశ్చితార్థం అయిన తర్వాత రోజే నేను షూటింగ్స్ కు హాజరు అయ్యాను. పెళ్లి తర్వాత కూడా నా కెరీర్ లో, సినిమాల ఎంపిక విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. పెళ్లి తేదీ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
నా పెళ్లి విషయంలో చాలా ప్లాన్స్ చేసుకున్నాను. కానీ నేను కోరుకున్నట్లుగా జరగలేదు. అయితే ఇది నేను కోరుకుని పెళ్లి అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఎప్పుడో అనుకున్న పెళ్లి ఇప్పుడు జరుగబోతుంది అంది. నా పెళ్లి అనేది నా జీవితంలోనే అతి పెద్ద ఆశ్చర్యకర విషయం అన్నట్లుగా వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పుకొచ్చింది.
గత కొంత కాలంగా నికోలయ్ సచ్‌దేవ్ తో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో ఉంది. ఇద్దరి ప్రేమకు పెద్దల అంగీకారం లభించడంతో పెళ్లి నిశ్చితార్థం అయ్యింది. ఈ ఏడాది లోనే పెళ్లి ఉండే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న వరలక్ష్మి తమిళంలో పలు సినిమాల్లో నటిస్తుందట.