వరలక్ష్మి శరత్ కుమార్ డెస్టినేషన్ వెడ్డింగ్ ఖర్చుపై క్లారిటీ ఇచ్చిన ఆమె తండ్రి..

ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఖర్చుపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ పబ్లిసిటీ జరుగుతుంది.

Update: 2024-07-08 06:15 GMT

సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి అంటే కోట్లకు కోట్లు ఖర్చవుతుంది అని అందరూ భావిస్తారు. పైగా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే ఆ హంగు ఆర్భాటం ఓ రేంజ్ లో ఉంటాయి. సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్ది సెలెబ్రిటీల లైఫ్ లో జరిగే ప్రతి చిన్న విషయానికి హై రేంజ్ లో పబ్లిసిటీ జరుగుతుంది. ఇందులో కొన్ని నిజాలు ఉంటే మరికొన్ని అంచనాలను మించిన అవాస్తవాలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి ఖర్చుపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ పబ్లిసిటీ జరుగుతుంది.

తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. జులై రెండవ తారీఖున ఆమె హైలాండ్ వేదికగా నికోలాయ్ సన్దేవ్ తో వివాహ బంధం లోకి ఎంటర్ అయ్యారు. అంగరంగ వైభవంగా థాయిలాండ్లో వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అనంతరం చెన్నైలో ఎంతో ఘనంగా రిసెప్షన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

వరలక్ష్మి శరత్ కుమార్ తల్లిదండ్రులు సౌత్ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్న నటీనటులు అన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో వీరి రిసెప్షన్ కు ఎందరో సినీ ప్రముఖులు హాజరయ్యారు. వీటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వరలక్ష్మీ పెళ్లి ఖర్చు గురించి తమిళనాడు పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతుంది.

పెళ్ళికొడుకు నికోలాయ్ సన్దేవ్, ముంబైలోనే అత్యంత సంపన్నులలో ఒకరు. ముంబైలో అతనికి ఒక సొంత ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంది. అతనికి సుమారు 900 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక నికోలాయ్ ఇది మొదటి పెళ్లి కాదు. ఇదివరకే పెళ్లయిన అతనికి ఇప్పటికే 15 సంవత్సరాల కూతురు కూడా ఉంది. ఇప్పుడు అతను వరలక్ష్మిని రెండవ పెళ్లి చేసుకుంటున్నాడు.

ఈ నేపథ్యంలో తన భార్యకు నికోలాయ్ బంగారు చెప్పులు, డైమండ్లతో చేసిన చీర బహుమతిగా ఇచ్చారని.. వాటి విలువ సుమారు 200 కోట్లకు పైగా ఉంటుందని సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కరలు కొడుతోంది. రిసెప్షన్ కి కూడా భారీగా ఖర్చు పెట్టారని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అంతేకాదు పెళ్లి ఖర్చు నిమిత్తం వరలక్ష్మి శరత్ కుమార్ తండ్రి సుమారు 200 కోట్లకు పైగా ఖర్చు చేశారు అన్న రూమర్ కూడా వినిపిస్తోంది.

ఈ విషయంపై స్పందించిన శరత్ కుమార్ తనదైన శైలిలో వీటికి రిటార్ట్ ఇచ్చారు.’అసలు అంత డబ్బు ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లేదు. ఇలాంటి వార్తలు పూర్తిగా తప్పు. ఏమీ తెలియనప్పుడు గమ్ముగా ఉండాలి తప్ప ఇలా తప్పుడు సమాచారం ప్రచారం చేయకూడదు. అయినా పెళ్లి కోసం అంత ఖర్చు చేయడం ఏంటి? ఒక సాధారణ వ్యక్తుల నా కుమార్తె పెళ్లి నేను జరిపించాను. అసలు ఏం జరుగుతుందో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి’అని అన్నారు.

Tags:    

Similar News