రౌడీ స్టార్‌ 'యానిమల్‌'.. వర్మ ది అదే మాట

యానిమల్‌ లో హీరో పాత్రను రణబీర్‌ కపూర్ మాత్రమే చేయగలడు.. ఆ పాత్రలో మరెవ్వరిని కూడా ఊహించుకోలేము అన్నట్లుగా ఆయన నటించాడు.

Update: 2023-12-09 07:37 GMT

అర్జున్‌ రెడ్డి / కబీర్ సింగ్‌ చిత్రంతో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసిన సందీప్‌ రెడ్డి వంగ మరోసారి యానిమల్‌ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి తాను స్పెషల్‌ అని... తన మేకింగ్‌ స్టైల్‌ స్పెషల్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు. అర్జున్‌ రెడ్డి హీరో తరహా పాత్రలనే తాను చేస్తానంటూ చెప్పి.. చెప్పినట్లుగానే యానిమల్‌ లో కూడా హీరోను ఓ రేంజ్‌ మ్యాడ్నెస్ తో చూపించాడు.

రణబీర్ పూర్ ను యానిమల్‌ లో దర్శకుడు చూపించిన తీరుకు పాన్ ఇండియా ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. రణబీర్ కపూర్‌ సినీ కెరీర్‌ ఆరంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. యానిమల్‌ సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఒక ఎత్తు అంటూ ఆయన అభిమానులు మాట్లాడుకుంటూ ఉన్నారు.

యానిమల్‌ లో హీరో పాత్రను రణబీర్‌ కపూర్ మాత్రమే చేయగలడు.. ఆ పాత్రలో మరెవ్వరిని కూడా ఊహించుకోలేము అన్నట్లుగా ఆయన నటించాడు. పాత్ర కు తగ్గట్లుగా రణబీన్‌ ను.. రణబీర్ కు తగ్గట్లుగా పాత్రను దర్శకుడు మలచిన తీరు అద్భుతం అంటూ నెటిజన్స్ మరియు సినీ రివ్యూవర్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు.

తెలుగు లో ఈ కథను మొదట మహేష్‌ బాబు వద్దకు దర్శకుడు తీసుకు వెళ్లాడు అనే ప్రచారం జరిగింది. దాంతో మహేష్ యానిమల్‌ చేసి ఉంటే ఎలా ఉండేది అన్న చర్చ జరుగుతోంది. చాలా మంది కూడా రణబీర్ తర్వాత యానిమల్‌ సినిమా ఆ స్థాయిలో కాకున్నా కొంత అయినా విజయ్ దేవరకొండకు సెట్‌ అయ్యేదని అంటున్నారు.

చాలా మంది రణబీర్‌ కపూర్ కి బదులు విజయ్‌ చేసినా కూడా యానిమల్ బాగుండేది అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా రామ్‌ గోపాల్‌ వర్మ కూడా ఆ విషయాన్నే చెప్పుకొచ్చాడు. విజయ్‌ దేవరకొండ తో యానిమల్‌ చేసి ఉంటే వర్కౌట్‌ అయ్యేది అన్నట్లుగా చెప్పుకొచ్చాడు.

సినిమాకు కొందరు బౌండరీలు సృష్టించారు. ఆ బౌండరీ లను దాటి సినిమా మేకింగ్‌ చేసే వారు మాత్రమే ఇలాంటి సినిమాలను తీయగలరు అంటూ యానిమల్‌ గురించి, దర్శకుడు సందీప్‌ వంగ గురించి గొప్పగా మాట్లాడిన రామ్ గోపాల్‌ వర్మ ఇప్పుడు రౌడీ స్టార్ కూడా యానిమల్ కి సూట్‌ అయ్యేవాడు అన్నట్లుగా అందరితో పాటు తన మాటగా చెప్పుకొచ్చాడు.

Tags:    

Similar News