వరుణ్ తేజ్- లావణ్య లవ్లీ వెడ్డింగ్ మూమెంట్స్
చివరికి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అతడి భార్య లావణ్య అన్యోన్యత.. కొత్త జంటలకు లైఫ్ గోల్స్ సెట్ చేస్తోంది. ఈ జంటకు విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉందంటే దానికి కారణం వారి మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, సుదీర్ఘ ప్రేమకథ ఇవన్నీ ఉన్నాయి. 1 నవంబర్ 2023న ఈ జంట ఒకటైంది. అంతకుముందు ఐదారేళ్ల పాటు ప్రేమలో ఉన్నారు. చివరికి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా వారి జీవితంలో అరుదైన పెళ్లి మూవ్ మెంట్స్ ని ప్రదర్శించే వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠి సంప్రదాయ పెళ్లి దుస్తులలో వరుణ్ తేజ్‌ని, హే, మిస్టర్! అని పిలుస్తోంది.. ఎరుపు రంగు దుస్తుల్లో ఉన్న వరుణ్ తన సఖితో సరసంగా కనిపిస్తున్న వీడియో హృదయాలను గెలుచుకుంది.
అలాగే లావణ్య గోల్డెన్ హార్ట్ కి వరుణ్ ఎలా క్లీన్ బౌల్డ్ అయ్యాడో కూడా ఇందులో వెల్లడించడం ఆసక్తికరం. ప్రేమ ఎన్నటికీ అందమైనది... ఈ జంట ఇతరులకు లక్ష్యాలను నిర్దేశించడం కొనసాగిస్తున్నారు. జీవితంలో తేనెలూరే మధురానుభూతులను ఆస్వాధిస్తున్నారు. మెగా జంటకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లావణ్య పెళ్లి తర్వాత నటనా కెరీర్ కి గ్యాప్ ఇచ్చింది. వరుణ్ నటించిన మట్కా చిత్రం నవంబర్ 14న విడుదలకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం వరుణ్ ప్రిపరేషన్ లో ఉన్నాడు.