వరుణ్​-లావణ్య పెళ్లి డేట్​ లాక్​.. ఆ రోజే!

ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్​ పద్ధతిలో జరిగేలా ఏర్పాట్లు చేస్తుకుంటున్నారు. అయితే నిజానికి వీరి పెళ్లి ఆగస్టులోనే జరగాల్సి ఉంది.

Update: 2023-08-22 06:01 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజాలు మోగే క్షణాలు దగ్గర పడ్డాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యే తమ ప్రేమను ఇంట్లో చెప్పి.. తమ రెండు కుటుంబాల సమక్షంలో జూన్‌ 9వ నిశ్చితార్థం చేసుకున్నారు. నాగబాబు ఇంట్లో ఈ వేడుక ఘనంగా జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ.. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. కానీ తాజాగా కాస్త క్లారిటీ వచ్చినట్లు తెలిసింది. పెళ్లి ఫిక్స్ అయినట్లు సమాచారం అందింది.

వరుణ్​-లావణ్య పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరగబోతుందనే విషయంపై మొదటి నుంచే మెగా అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. పెళ్లి వివరాలు గురించి ఫ్యాన్స్ ఆరా తీస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ జంట పెళ్లి వివరాలు గురించి రోజుకో వార్త బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త జంట తమ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు మొదలు పెట్టారు.

ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్​ పద్ధతిలో జరిగేలా ఏర్పాట్లు చేస్తుకుంటున్నారు. అయితే నిజానికి వీరి పెళ్లి ఆగస్టులోనే జరగాల్సి ఉంది. కానీ వరుణ్ తేజ్ సినిమాల రిలీజ్​.. నిహారిక డివోర్స్​ వ్యవహారం వంటి కారణాలతో కాస్త వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం.. వరుణ్ తేజ్, లావణ్యల పెళ్లి నవంబరు నెలలో ఉండనుందని తెలిసింది.

నవంబర్ 1వ తేదీని ఫిక్స్​ చేసినట్లు సమాచారం అందింది. ఇరు కుటుంబల సమక్షంలో ఇటలీలో జరగనుందట. మూడు రోజుల పాటు డెస్టినేషన్ వెడ్డింగ్ పద్ధతిలో ఇది జరగనుందట. మెగా ఫ్యామిలీ మొత్తం పెళ్లికి వెళ్లబోతున్నారట. కానీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ మాత్రం ఒక్కరే తనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా హాజరుకాకపోవచ్చని అంటున్నారు.

ఇకపోతే వరుణ్ తేజ్.. ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. స్టైలిష్ అండ్ యాక్షన్​ ఎంటర్​టైనర్​గా ఇది రానుంది. ఇందులో వరుణ్​ సెక్యూరిటీ ఆఫీసర్​గా కనిపించనున్నారు. దాదాపు రూ.50కోట్ల బడ్జెట్​తో ఈ సినిమా రూపొందింది.

Tags:    

Similar News