ఫీన్లాండ్ మంచు పర్వతాల్లో కొత్త దంపతులు!
వరుణ్-లావణ్య హనీమూన్ స్పాట్ మంచు పర్వతాలు వేదికైంది. ఫిన్లాండ్ లోని లాప్లాండ్ ను వేదికగా చేసుకున్నారు. -10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో మంచు పర్వాతాల్లో జోడీ ఆస్వాదిస్తోంది.
వివాహం అనంతరం వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి హనీమూన్ కి ఏదేశానికి వెళ్తారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత వరుణ్ వెంటనే సినిమా పనుల్లో బిజీ అవ్వడంతో! హనీమూన్ ప్లానింగ్ లాంటివి లేనట్లుందని అంతా భావించారు. కానీ తాజాగా జోడీ హనీమూన్ సంథింగ్ స్పెషల్ గానే ప్లాన్ చేసినట్లు కనిపిస్తుంది. రొటీన్ లైఫ్ కి భిన్నంగా...సాధారణ వెకేషన్లకు వినూత్నంగా హనీమూన్ కోసం సుదూర ప్రాంతానికే వెళ్లినట్లు తెలుస్తోంది.
వరుణ్-లావణ్య హనీమూన్ స్పాట్ మంచు పర్వతాలు వేదికైంది. ఫిన్లాండ్ లోని లాప్లాండ్ ను వేదికగా చేసుకున్నారు. -10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలో మంచు పర్వాతాల్లో జోడీ ఆస్వాదిస్తోంది. మంచులో స్కేటింగ్ చేస్తూ జంట వెకేషన్ ని ఆస్వాదిస్తున్నారు. దంపతులు ఇద్దరు స్కేటింగ్ దుస్తుల్లో దూరిపోయి రయ్ రయ్ మంటూ మంచు పై పరుగులు తీస్తున్నారు. చుట్టు పక్కల మంచు అందాల్లో ఇళ్లు మరింత అందంగా కనిపిస్తున్నాయి.
వరుణ్ తేజ్ చేతిలో పొగలు కక్కుతొన్న కాపీ కప్ తో ఉన్న పిక్ బాగుంది. మంచు కొడల్లో రిసార్స్ట్ ఎంతో అందంగా ఉన్నాయి. రాత్రి సమయంలో మంచు పర్వాతాలపై మిరుమిట్లు గొలుపుతోన్న కాంతులు మరింత రమణీయతను తీసుకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానుల్ని ఆ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. మరోసారి పెళ్లి శుభాకాంక్షలు బెబుతూ...హ్యాపీ హనీమూన్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఇక వెకేషన్ ముగించిన అనంతరం వరుణ్ తేజ్ మళ్లీ షూటింగ్ లో బిజీ అవుతాడు. ఇప్పటికే 'ఆపరేషన్ వాలెంటైన్' షూటింగ్ పూర్తిచేసాడు. ఆ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆ సినిమాకి సంబంధించి వరుణ్ డబ్బింగ్ పూర్తి చేయాలి. అలాగే మరో హైదరాబాద్ లో 'మట్కా' సినిమాకి సంబంధించి సెట్లు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి ఆసినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.