ఫోటో స్టోరి: స్నేహమంటే ఇదేరా
అయితే వరుణ్ తరుపున ఒకే ఒక్క స్నేహితుడు మాత్రం సతీసమేతంగా హాజరయ్యాడు. అతనే యూత్ స్టార్ నితిన్
ఇటలీలో జరిగిన వరుణ్ తేజ్-లావణ్య పెళ్లికి దాదాపు మెగా కుటుంబ సభ్యులే హాజరయ్యారు. ఆ కుటుంబా నికి బాగా కావాల్సిన వాళ్లు మాత్రమే వెళ్లారు. అందులో పెళ్లి కొడుకు తరుపునగానీ..పెళ్లి కుమార్తె తరుపున గానీ స్నేహితులు ఎవరూ కనిపించలేదు. సాధారణంగా పెళ్లి అంటే తప్పకుండా ముఖ్యమైన స్నేహితులు హాజరవుతారు. కానీ వరుణ్ -లావణ్య మాత్రం ఆఛాన్స్ తీసుకోలేదు. పెళ్లి కేవలం పెద్దల వరకే పరమితం చేసినట్లు తెలుస్తోంది.
అయితే వరుణ్ తరుపున ఒకే ఒక్క స్నేహితుడు మాత్రం సతీసమేతంగా హాజరయ్యాడు. అతనే యూత్ స్టార్ నితిన్. అవును టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలు ఉన్నారు. దర్శక-నిర్మాతలతోనూ వరుణ్ ఎంతో క్లోజ్ గా ఉంటాడు. కానీ తన పెళ్లికి మాత్రం నితిన్ ని మాత్రమే పిలిచినట్లు కనిపిస్తుంది. వరుణ్ పెళ్లికి నితిన్ అండ్ కపుల్ మాత్రమే ప్రత్యేక అతిథులుగా హాజరైనట్లు తెలుస్తోంది. దీంతో నితిన్ -వరుణ్ మధ్య ఎంత క్లోజ్ నెస్ ఉందో అర్ధమవుతుంది.
కొత్త దంపతులతో నితిన్ దంపతులు దిగిన ఫోటోలు కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. నితిన్ స్నేహితుడి పెళ్లికి ఇటలీకి హాజరవ్వడంతో! ఇద్దరు చాలా క్లోజ్ ప్రెండ్స్ అని చాలా మందికి ఇప్పుడే తెలుస్తుంది. నిజానికి మీడియాలో కూడా ఈ విషయం ఇంతవరకూ పెద్దగా హైలైట్ కాలేదు. మరి వరుణ్ తో ఉన్నా క్లోజ్ నెస్ కారణంగా పెళ్లికి వెళ్లాడా? లేక పవన్ అభిమానంతో వెళ్లాడా? అన్నది చిన్న డౌట్.
నితిన్ పవన్ కి వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఆ అభిమానం చాలా కాలం క్రిమతే స్నేహంగానూ మారింది. నితిన్ సినిమా ఈవెంట్లకు పవన్ గెస్ట్ గానూ హాజరైన సందర్భాలున్నాయి. అలాగే ఇద్దరి మధ్య మంచి బాండిగ్ బలపడింది. ఈ నేపథ్యంలో పవన్ పిలుపు మేరకు మెగా ఫ్యామిలీ నితిన్ ని కూడా ప్రత్యేకంగా ఇటలీకి ఆహ్వానించినట్లు కొందరు అభిప్రాయ పడుతున్నారు.