వరుణ్ తేజ్ ఐకానిక్ ప్రాజెక్ట్.. రంగంలోకి మరో క్రేజీ బ్యూటీ!
ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరిని అనుకున్నారు. మరో అప్‌డేట్ ఏమిటంటే, గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి ప్రాజెక్ట్‌లో భాగం కానుందట.
మెగా హీరో వరుణ్ తేజ్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ మెగా హీరో సినిమా సినిమాకు చాలా వ్యత్యాసం ఉండేలా చూసుకుంటున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన వరుణ్ తేజ్ నెవర్ బిఫోర్ అనెలా డిఫరెంట్ కథలను చేయాలని ఆలోచిస్తున్నాట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గాండీవధారి అర్జున అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా డిఫరెంట్ యాక్షన్ స్పై సినిమా గా రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. అయితే మరోవైపు వరుణ్ తేజ్ కరుణ కుమార్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. పలాస అనే సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న దర్శకుడు కరుణ కుమార్ వరుణ్ తేజ్ తో గత రెండేళ్ల నుంచి ఒక కథ గురించి చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక పీరియడ్ డ్రామాగా తెరకెక్కపోయే కథకు వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం .మొత్తం కథ కూడా వైజాగ్‌లో 1960ల కాలం నాటి పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందట. 60ల నాటి వాతావరణం మరియు అనుభూతిని తెరపైకి తీసుకు రావడానికి బృందం అదనపు జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇక వరుణ్ తేజ్ 14వ చిత్రంగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ను వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. #VT14 వరుణ్ తేజ్ కెరీర్ లో మరో అత్యధిక బడ్జెట్ చిత్రం అవుతుంది. ఈ సినిమాలో కథానాయికగా మీనాక్షి చౌదరిని అనుకున్నారు. మరో అప్‌డేట్ ఏమిటంటే, గ్లామరస్ బ్యూటీ నోరా ఫతేహి ప్రాజెక్ట్‌లో భాగం కానుందట.
స్పెషల్ ఐటెం సాంగ్స్ తో బాగా గుర్తింపున అందుకున్న నోరా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే బిజీగా మారుతుంది. అలాగే తమిళ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇక కేవలం సాంగ్స్ మాత్రమే కాకుండా మంచి క్యారెక్టర్స్ కూడా చేయాలి అని అమ్మడు అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో వరుణ్ తేజ్ 14వ సినిమాలో కోసం దర్శకుడు కరుణ కుమార్ సంప్రదించడంతో క్యారెక్టర్ నచ్చి వెంటనే సిగ్నల్ ఇచ్చిందట. ఈ నెల 27న హైదరాబాద్‌లో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా ప్రారంభించనున్నారు. అదే తేదీన మిగిలిన నటీనటులు మరియు సిబ్బందిని మేకర్స్ ప్రకటిస్తారు.