'మట్కా'లో వరుణ్ తేజ్ 4 గెటప్స్ లో?
ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఏకంగా 4 విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడుట
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిథ్యమైన కాన్సెప్ట్ లతో మళ్లీ నెట్టింట సంచలనమవుతోన్న సంగతి తెలిసిందే. విటి 13వ చిత్రం దేశ భక్తి నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇందులో వరుణ్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి పాత్ర పోషిస్తున్నాడు. వరుణ్ నుంచి మరో డిఫరెంట్ అటెంప్ట్ ఇది. దీంతో పాటు కరుణ కుమార్ తో 14వ చిత్రాన్ని తాజాగా సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కథ ఏకంగా ప్రేక్షకుల్ని 60 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. నిన్ననే సినిమా అధికారికంగానూ లాంచ్ అయింది.
ఈ సందర్భంగా సినిమా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. 'మట్కా' అనేది ఒకరకమైన జూదం. 1958-82 మధ్య సాగే స్టోరీ ఇది. అప్పట్లో యావత్ దేశాన్ని కదలించినో యధార్ధ సంఘటన ఆ ధారంగా ఈ చిత్రన్ని రూపొందిస్తున్నారు. ఈ సంఘటనలో వైజాగ్ లో జరిగింది. సినిమా అంతా పూర్తిగా వైజాగ్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. అందుకు తగ్గట్టు వింటేజ్ సెట్ ని నిర్మిస్తున్నారు.
కథ ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఆ సెట్ లోనే చిత్రీకరణ ఉంటుంది. ఔట్ డోర్ సన్నివేశాలంటూ చాలా రేర్ గాన ఉంటాయని తెలుస్తోంది. 60-80 కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ప్రత్యేకమైన సెట్లో చేయాల్సిన సినిమా కాబట్టి! దాదాపు హైదరాబాద్ లోనూ షూట్ ఉంటుంది. అయితే విశాఖ పట్టణం పరిసరాల్లో అభివృద్దికి నోచుకోని కొన్ని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి. అవసరం మేర అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించే అవకాశం ఉంది.
ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఏకంగా 4 విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడుట. వాటి ఆహార్యం చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. అప్పటి మనుషులు ఎలా ఉండేవారు? ఎంత మాసివ్ గా ఉండేవారు? అన్నది సినిమాలో హైలైట్ చేయనున్నారు. వరుణ్ కేవలం గెటప్స్ లో మాత్రమే హైలైట్ చేస్తున్నారు. స్టోరీ డిమాండ్ మేరకు వరుణ్ పాత్రని ఆ రకంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో గద్దల కొండ గణేష్ లో వరుణ్ తేజ్ రగ్గడ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. విటి- 14 లో అంతకు మించి వైవిథ్యమైన లుక్ లో కనిపించనున్నాడు.