వరుణ్ తేజ్-నిహారిక బాగా కొట్టుకునేవారుట!
వరుణ్ తేజ్-నిహారిక రిలేషన్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల బిడ్డలుగా.. అన్నా-చెల్లెళ్లుగా టాలీవుడ్ లో జర్నీ సాగిస్తున్నారు.
వరుణ్ తేజ్-నిహారిక రిలేషన్ షిప్ గురించి చెప్పాల్సిన పనిలేదు. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల బిడ్డలుగా.. అన్నా-చెల్లెళ్లుగా టాలీవుడ్ లో జర్నీ సాగిస్తున్నారు. వరుణ్ హీరోగా అలరిస్తుంటే...నిహారిక వివిధ పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. మరి ఈ అన్నా-చెల్లి చిన్నప్పుడు ఎలా ఉండేవారో తెలుసా? ఆ కహాని ఏంటి వరుణ్ మాటల్లోనే... `నిహారిక ఇంట్లో ఉంటే ఆ సందడే వేరు. ఇల్లంతా హడావుడిగా ఉంటుంది.
గలగలా మాట్లాడుతుంది. చిన్నప్పుడు ఇద్దరం బాగా కొట్టుకునే వాళ్లం. ఇంట్లో ఉన్నంత సేపు ఒకరిపై ఒకరు అమ్మనాన్నలకు ఫిర్యాదులు చేసేవాళ్లం. కానీ ఒకర్ని విడిచి ఒకరు ఉండటం మాత్రం చాలా కష్టం ఉండేది. మొదటిసారి నేను యాక్టింగ్ నేర్చుకోవడానికి బయటకు వెళ్లాను. అప్పుడు చెల్లి తట్టుకోలే కపోయింది. అన్నయ్య దగ్గరకు వెళ్తానని ఏడ్చేసిందిట. అలాగే నిహా షూటింగ్ ల కోసం బయటకు వెళ్తుంటే నాకు వెలితిగా ఉండేది.
ఇంటికి కూడా రావాలనిపించదు. తను ఎప్పుడెప్పుడు తిరిగొస్తుందా? అని ఎదురు చూస్తుంటాను. ఏ విషయమైనా ఇద్దరం పంచుకుంటాం. ప్రతీ విషయంలో సలహాలు ఇచ్చి పుచ్చుకుంటాం. నీహా నాతోనే కాదు..మా కజిన్స్ అందరితోనూ అంతే క్లోజ్ గా ఉంటుంది` అన్నారు. మొత్తానికి నిహరిక-వరుణ్ తేజ్ మధ్య చిన్నప్పుడు పెద్ద యుద్దమే జరిగేది. సాధారణంగా చిన్నవయసులో ఇలాంటి ఫైటింగ్ లు అన్నా-చెల్లి మధ్య సహజమే.
ప్రతీ ఇంట్లో ఉండే కథే. అలాంటి అన్నా-చెల్లి మధ్య ఎక్కువగా ప్రేమ కూడా ఉంటుంది. చిన్న వయసులో ఎంత కొట్టుకుంటే పెద్దయ్యాక అంతకంతకు ఆ ప్రేమ రెట్టింపు అవుతుంది. నిహా-వరుణ్ మధ్య బాండింగ్ అలాంటిదే. ఇటీవలే నిహారిక భర్త చైతన్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇద్దరి మధ్య పొరపొచ్చాలు రావడంతో! విడిపోయారు. ప్రస్తుతం నిహారిక తల్లిందండ్రుల దగ్గరే ఉంటోంది. అలాగే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిని ప్రేమ వివాహం చేసుకుంటున్నాడు.