హీరో విలన్ ఒక్కడేనా?
ఇక సినిమాలో వరుణ్ తేజ్ ఏకంగా 4 విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. ఆ పాత్రల ఆహార్యం డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా కరణ్ కుమార్ దర్శకత్వంలో 'మట్కా' అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. వరుణ్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతుంది. 1958-82 మధ్య సాగే స్టోరీ ఇది. యావత్ దేశాన్ని కదలించిన ఓ యధార్ధ సంఘటన ఆ ధారంగా రూపొందిస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న చిత్రం ఎక్కువ భాగం షూటింగ్ అంతా సెట్స్ లోనే తెరకెక్కిస్తున్నారు. సెట్స్ నిర్మాణం కోసమే కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు.
కథ ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఆ సెట్ లోనే చిత్రీకరణ ఉంటుంది. ఔట్ డోర్ సన్నివేశాలంటూ చాలా రేర్ గానే ఉంటాయని తెలుస్తోంది. ఇక సినిమాలో వరుణ్ తేజ్ ఏకంగా 4 విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. ఆ పాత్రల ఆహార్యం డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది.అప్పటి మనుషులు ఎలా ఉండేవారు? ఎంత మాసివ్ గా ఉండేవారు? అన్నది సినిమాలో హైలైట్ చేస్తున్నారు. తాజాగా సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందుతోంది.
ఇప్పటికే చిత్రీకరణ 70 శాతం పూర్తయినట్లు చిత్ర వర్గాల నుంచి తెలుస్తుంది. కొత్త షెడ్యూల్ ఈనెల 19నుంచి ప్రారం భమవుతుంది. దీనికి సంబంధించి రామోజీ ఫిలి సిటీలో ప్రత్యేకంగా మరోసెట్ నిర్మిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో వరుణ్ తేజ్ పై భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారుట. అలాగే యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ కోసం కొంత మంది ఓల్డ్ స్టంట్ మాస్టర్లని రంగంలోకి దించుతున్నారుట.
యాక్షన్ సీన్స్ కోసం అప్పటి తరం లో ఎలాంటి టెక్నిక్ లు వాడేవారు? పత్యర్ధుల్ని మట్టి కరిపించడం కోసం ఎలా పోరాడేవారు వంటి వాటిని వరుణ్ పాత్ర రూపంలో హైలైట్ చేయబోతున్నారుట. అలాంటివాటన్నింటిని రిఫరెన్స్ లుగా తీసుకుని ఫైట్స్ కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ నాలుగు గెటప్స్ లో ఒక గెటప్ పూర్తిగా నెగిటివ్ కోణంలో సాగుతుందని సమాచారం. కరణ్ కుమార్ తొలి సినిమా 'పలాస'లో కూడా మాస్ ఫైట్లు కొన్ని ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మట్కా లోయాక్షన్ సన్నివేశాల్లోనూ చాలా ప్రత్యేకత ఉండేలా ఉంది.