మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి తేదీ లాక్ అయినట్టేనా?
ఆగస్ట్ 24న మెగా వెడ్డింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేసుకుని వెన్యూని ఫైనల్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ .. లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం గత నెలలో మణికొండలోని నాగబాబు ఇంట్లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రైవేట్ వేడుకగా జరిగిన ఈ కార్యక్రమానికి మెగా అల్లు కుటుంబాలకు చెందిన వారంతా వారి బంధుమిత్రులు సన్నిహితులతో ఈ వేడుకకు అటెండయ్యారు. నిశ్చితార్థం తర్వాత ఈ జంట పెళ్లి తేదీ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆగస్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు ముగిసిన రెండు రోజులకు అంటే ఆగస్ట్ 24న మెగా వెడ్డింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేసుకుని వెన్యూని ఫైనల్ చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వధూవరుల కుటుంబ సభ్యులు సహా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఇటలీలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
వాస్తవానికి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ ... దీపికా పదుకొనే-రణ్వీన్ సింగ్ కూడా ఇటలీలో వివాహం చేసుకున్నారు. వరుణ్ - లావణ్య త్రిపాఠి జోడీ పరిచయం ఆసక్తికరం. వీరిద్దరూ `మిస్టర్`-`అంతరిక్షం 9000 KMPH` వంటి చిత్రాలలో జంటగా నటించారు. అదే క్రమంలో ప్రేమలోను పడ్డారు. ఇప్పుడు పెళ్లితో ఒక అంకం ముగియనుంది.