వరుణ్ తేజ్, లావణ్య పెళ్లి.. మరో ట్విస్ట్?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకొని పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకొని పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ హైదరాబాద్ లో జరిగింది. కుటుంబం సభ్యుల సమక్షంలోనే ఎంగేజ్మెంట్ నిర్వహించారు. ఇద్దరు ప్రస్తుతం ఉన్న సినిమాలు పూర్తయిన వెంటనే పెళ్లి జరుగుతుందని ప్రచారం నడిచింది. అలాగే ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నట్లు గతంలోనే క్లారిటీ ఇచ్చారు. వెన్యూ కూడా ఖరారు చేసి ఆగష్టు 24, 25 తేదీలలో పెళ్లి ఉంటుందని ప్రకటించారు.
అయితే పెళ్ళికి ఇంకా చాలా తక్కువ సమయం ఉంది. కానీ మెగా ఫ్యామిలీలో ఎలాంటి హడావిడి లేదు. అందరూ సైలెంట్ గా ఎవరి యాక్టివిటీస్ లో వారు బిజీగా ఉన్నారు. వరుణ్ తేజ్ గాండీవదారి అర్జున మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. నిజానికి మెగా ఫ్యామిలీలో పెళ్లి వేడుక చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటారు. అది కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి కచ్చితంగా సందడి ఉంటుంది. పెళ్లికి పది రోజుల ముందు నుంచి సంప్రదాయ పెళ్లి తంతు మొదలవుతుంది.
పెళ్లి శుభలేఖలు కూడా ఈపాటికే ముందించేసి ఉండాలి. అయితే ఇవేమీ కూడా ప్రస్తుతం కనిపించడం లేదు. దీంతో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వాయిదా పడిందని అందరూ భావిస్తున్నారు. అధికారికంగా మెగా ఫ్యామిలీ నుంచి ఎలాంటి క్లారిటీ రాకపోయిన కూడా ప్రస్తుత వాతావరణం చూస్తుంటే అలానే కనిపిస్తోంది. అటు లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి స్పందన లేదు.
పెళ్లి డేట్ ఫిక్స్ చేసిన కూడా నిహారిక విడాకులు అయిన కొద్ది రోజులకే మరల ఈ సెలబ్రేషన్ అంటే బాగుండదు అని భావించి నాగబాబు అభ్యర్ధన మేరకు పెళ్లి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నిహారిక ప్రస్తుతం విడాకుల డిప్రెషన్ నుంచి బయటకొచ్చే పనిలో ఉంది. దానికోసం ఫ్రెండ్స్ తో కలిపి వెకేషన్స్ కి వెళ్తూ కంప్లీట్ గా ఆ మూడ్ నుంచి బయటపడాలని భావిస్తోంది. మెగా ఫ్యామిలీ కూడా నిహారికకి మానసిక స్థైర్యం ఇస్తున్నారు.
కంప్లీట్ గా విడాకుల మూడ్ నుంచి ఫ్యామిలీ మొత్తం బయటకొచ్చాక టైం చూసుకొని పెళ్లి డేట్ ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారంట. అందుకే ప్రస్తుతం అనుకున్న డేట్స్ క్యాన్సిల్ చేసి పెళ్లి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. లావణ్య, వరుణ్ తేజ్ కూడా దీనికి సమ్మతించినట్లు టాక్.