వైజాగ్ రియల్ లొకేషన్లో మట్కా!
నిన్న మొన్నటివరకూ `మట్కా` షూటింగ్ హైదరాబాద్ రామోజీఫిలిం సిటీలో జరిగిన సంగతి తెలిసిందే.
నిన్న మొన్నటివరకూ `మట్కా` షూటింగ్ హైదరాబాద్ రామోజీఫిలిం సిటీలో జరిగిన సంగతి తెలిసిందే. 1950-80 కాలం నాటి వైజాగ్ సెట్లు నిర్మించి అక్కడే షూటింగ్ నిర్వహించారు. దీనిలో భాగంగా ఎన్నోసెట్లు వేసారు. వాటి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసారు. ఇంతవరకూ యూనిట్ కేవలం ఆర్ ఎఫ్ సీలోనే షూటింగ్ చేసింది. ఔట్ డోర్ కి వెళ్లింది లేదు. ఈనేపథ్యంలో తాజాగా కొత్త షెడ్యల్ రియల్ లొకేష్ వైజాగ్ కే షిప్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో వరుణ్ తేజ్ సహా ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది. హైదరాబాద్ షెడ్యూల్ కి కంటు న్యూటీ సన్నివేశాలు ఈ సీన్స్ ఉంటాయని చిత్ర వర్గాల సమాచారం. నెల రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుందని తెలిసింది. అయితే ఈ మొత్తం షెడ్యూల్ కంటున్యూగా ఇక్కడే షూటింగ్ చేస్తారా? వేర్వేరు లొకేషన్లతో లింకప్ అయి ఉందా? అన్నది తెలియాలి. అలాగే వైజాగ్ లో ఏ ప్రాంతాల మధ్య షూటింగ్ జరుగుతుందన్ని యూనిట్ రివీల్ చేయలేదు.
1950-80 మధ్య కాలం నాటి స్టోరీ కాబట్టి వైజాగ్ లో అప్పటి లొకేషన్లు? అంటే కొండ, గిరిజన ప్రాంతాల్లోనే దొరుకుతాయి. ఈ నేపథ్యంలో చిన్న యూనిట్ ఆయా ప్రాంతాలకు వెళ్తుందా? అన్నది తెలియాలి.
ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఏకంగా 4 విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నాడు. వాటి ఆహార్యం చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది. అప్పటి మనుషులు ఎలా ఉండేవారు? ఎంత మాసివ్ గా ఉండేవారు? అన్నది సినిమాలో హైలైట్ చేస్తున్నారు.
స్టోరీ డిమాండ్ మేరకు వరుణ్ పాత్రని ఆ రకంగా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరుణ్ ఫేస్ ని హైడ్ చేసి తెలుపు దుస్తుల్లో ఇప్పటికే ఓ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే వరుణ్ నేచురల్ హెయిర్ స్టైల్ కూడా అతడి లుక్ పర్పెక్షన్ కి బాగా కలిసొస్తుందని తెలుస్తోంది. గతంలో గద్దల కొండ గణేష్ లో కూడా వరుణ్ తేజ్ రగ్గడ్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.