వరుణ్ తేజ్.. ఈసారి బడ్జెట్ దెబ్బ?

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు బజ్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం కలెక్షన్స్ అయితే అందుకునేవి.

Update: 2023-11-24 11:30 GMT

ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలు బజ్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మినిమం కలెక్షన్స్ అయితే అందుకునేవి. కానీ ఈసారి కంటెంట్ పర్ఫెక్ట్ గా జనాల్లోకి వెళ్లకపోతే మాత్రం మొదటి రోజే ఊహించని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. హీరో ఎవరైనా సరే ముందుగా సినిమా ఫస్ట్ లుక్ టీజర్ నుంచి విడుదల తర్వాత టాక్ కొరకు అన్ని పాజిటివ్గా ఉంటేనే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే వస్తున్నాయి.

లేదంటే సినిమాలకు దారుణంగా నష్టాలు వస్తున్నాయి. ఆ ప్రభావం తదుపరి సినిమాలపై కూడా పడుతోంది. గత కొంతకాలంగా వరుణ్ తేజ్ పరిస్థితి కూడా ఇదే తరహాలో మారిపోయింది. అతని గత సినిమాల వైఫల్యాలు ఇప్పుడు తదుపరి సినిమాలపై ప్రభావం చూపుతున్నాయి. షూటింగ్ దశలో ఉండగానే ఇప్పుడు నిర్మాతలు బడ్జెట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.

వరుణ్ తేజ్ పర్ఫెక్ట్ సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. గద్దల కొండ గణేష్ పర్వాలేదు అనిపించినప్పటికీ ఆ తర్వాత వచ్చిన గని గరుడవేగ సినిమాలు ఏ రేంజ్ లో డిజాస్టర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కనీసం పెట్టిన పెట్టుబడిలో సగం కూడా వెనక్కి తీసుకోరాలేక పోయాయి. ఇక మధ్యలో వచ్చిన F3 సినిమా కూడా అంత మాత్రం గానే ఆడింది.

ఇక ఇప్పుడు వరస డిజాస్టర్ల కారణంగా బజ్ లేక తదుపరి సినిమాలో ఒకటి విడుదలకి ఆలస్యం అవుతుంటే మరొకటి షూటింగ్ దశలోనే బడ్జెట్ విషయంలో వలన ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ సినిమా డిసెంబర్లోనే విడుదల కావాల్సింది. కానీ ఇప్పుడు ఆ సినిమాకు బజ్ లేకపోవడంతో మార్కెట్లో కూడా పెద్దగా డిమాండ్ అయితే రాలేదు.

ఎందుకో ఏమో కానీ ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది. ఇక కరుణకుమార్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ మట్కా అనేక ఒక పీరియడ్ డ్రామా సినిమాను ఇటీవల స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు ఆ నిర్మాతలు బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవుతోంది అని మళ్లీ ఒకసారి ఆలోచించి బడ్జెట్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని దర్శకుడితో చర్చలు జరిపినట్లు సమాచారం.

మరొక దారి లేక వరుణ్ తేజ్ కూడా ఈ విషయంలో పెద్దగా అడ్డు చెప్పలేదని తెలుస్తోంది. ఎందుకంటే గత రెండు సినిమాలు కూడా బడ్జెట్ ఎక్కువ కావడం కూడా నిర్మాతలకు దారుణంగా నష్టాలను కలిగించాయి. ఇక ఈసారి మట్కా విషయంలో కూడా వరుణ్ తేజ్ నిర్మాతలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కలుస్తోంది. మరో ప్రణాళిక రచించి బడ్జెట్ లిమిట్ దాటకుండా సినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం.

Tags:    

Similar News