ఫోటో స్టోరి: మెగా పెళ్లికొడుకు వ్వాటే జోయ్?
వరుణ్ -లావణ్యతో పాటు ఇప్పటికే మెగా బృందం టుస్కానీలో వెన్యూ వద్దకు ఎటెండయ్యారు.
అందమైన ప్రేమపక్షులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి రెడీ అయిన సంగతి తెలిసిందే. వధూవరులు ఇప్పటికే ఇటలీలో ఉన్నారు. పలువురు మెగా కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి తమ జీవితంలో బిగ్ డే కోసం వేచి చూస్తున్నారు. వరుణ్ తేజ్.. లావణ్య జంట టుస్కానీ వెదర్ ని ఒక రేంజులో ఆస్వాధిస్తున్నట్టే కనిపిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి.
ఈ ఫోటోల్లో వరుణ్ సోలో ఫోటోలతో పాటు, వధువు లావణ్య త్రిపాఠితో నాణ్యమైన సమయాన్ని గడుపుతున్న ఫోటోలు అందంగా కనిపిస్తున్నాయి. వరుణ్ తన లేడీ లవ్ తో ఆనందకర మూడ్‌లో ఉన్నప్పుడు అతడిపై స్నాప్ లు మెరిసాయి. వరుణ్ ఆహ్లాదకరమైన చిరునవ్వు .. నేపథ్యంలో అందమైన ఇంద్రధనస్సు మిస్ అవ్వకూడనివి. వరుణ్ -లావణ్యతో పాటు ఇప్పటికే మెగా బృందం టుస్కానీలో వెన్యూ వద్దకు ఎటెండయ్యారు.
పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవాతో కలిసి ఈ పెళ్లికి అటెండయ్యారు. రామ్ చరణ్ తన భార్య ఉపాసన, కుమార్తెతో కలిసి విచ్చేసారు. వరుణ్ సోదరి నిహారిక సహా పలువురు వరుణ్ స్నేహితులు కూడా ఈ వేడుక కోసం టుస్కానీలో అడుగుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, ఉప్పెన తేజ్ తదితరులు ఈ వేడుకలో సందడి చేస్తారు. మెగా అల్లు కుటుంబాల దీవెనల నడుమ, అభిమానుల దివ్యమైన ఆశీస్సులతో ఈ పెళ్లి ఘనంగా జరుగుతోంది.
లగ్గం అయ్యాక నెలరోజులు హనీమూన్:
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి అభిమానుల్లో హాట్ టాపిక్. ఇంతకుముందే వీరి పెళ్లి ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివాహ వేడుక వివరాలను వెడ్డింగ్ ఇన్విటేషన్ లో వెల్లడించారు. ఇందులో హైదరాబాద్ లోని ప్రముఖుల కోసం ప్రత్యేక విందు కార్యక్రమం తేదీని కూడా ఫిక్స్ చేసారని రివీలైంది. పెండ్లి శుభలేఖ వెండి - బంగారం థీమ్‌తో ఎంతో అందంగా ఉంది. ఈ ఆహ్వానంలో చిరంజీవి కొణిదెల, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ నుండి 'ఉత్తమ అభినందనలతో' అని ముద్రించి ఉండడం విశేషం. అందులో 'శ్రీమతి పద్మజ & శ్రీ కొణిదెల నాగబాబు తమ ముద్దుల కొడుకు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి వివాహ రిసెప్షన్ సందర్భంగా దయతో హాజరు కావాలని అభ్యర్థన'' అని రాసి ఉంది.
అక్టోబర్ 30 నుంచి వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రీవెడ్డింగ్ లో భాగంగా కాక్టెయిల్ నైట్ అనంతర రోజుల్లో మెహందీ, హల్దీ వేడుకలు జరగనున్నాయి. కాక్ టైల్ పార్టీ ఇటాలియన్ స్టైల్ లో రొమాంటిక్ గా ప్లెజెంట్ గా ఉండనుంది. తర్వాత అక్టోబర్ 31న మెహందీ, హల్దీ నైట్ వేడుకలు సాగుతాయి. పెళ్లి అనంతరం రిసెప్షన్స్ పూర్తయాక, సుదూర తీరానికి నెలరోజుల పాటు హనీమూన్ కోసం కొత్త జంట వెళుతుంది.