ప్లాప్ సినిమాకి సక్సెస్ సెలబ్రేషన్లా?
ఏ సినిమా అయినా విజయం సాధిస్తే ఆ సంతోషంలో గ్రాండ్ గా సక్సెస్ పార్టీ సెలబ్రేట్ చేస్తుంటారు.
ఏ సినిమా అయినా విజయం సాధిస్తే ఆ సంతోషంలో గ్రాండ్ గా సక్సెస్ పార్టీ సెలబ్రేట్ చేస్తుంటారు. ముఖ్యంగా తెలుగు సినిమాలో ఇలాంటి సక్సెస్ పార్టీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే సక్సెస్ కాకపోయినా పార్టీలు కనిపిస్తుంటాయి. ప్లాప్ సినిమాలకు సక్సెస్ అయిందని చెప్పుకుని పార్టీలు సెలబ్రేట్ చేసుకునే హీరోలు, దర్శక, నిర్మాతలు కొంత మంది ఉన్నారు. అలాంటి పార్టీ ఇటీవల విడుదలైన ఓ సినిమా విషయంలో జరిగింది.
సినిమా ప్లాప్ అయినా హిట్ అయిందని ఓ రకమైన స్ట్రాటజీ ప్రచారం ఇది. కనీసం పెట్టిన పెట్టుబడిలో పావు వంతు అయినా రికవరీ అవుతుంది అన్న నమ్మకంతో ఇలాంటి పార్టీలు సెలబ్రేట్ చేస్తుంటారు. ప్రతిగా సోషల్ మీడియాలో తిరుగుబాటు ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. అది వేరే లెవల్ మ్యాటర్. తాజాగా ఈనెల 15న జాన్ అబ్రహం, శార్వరీ వాఘ్, అభిషేక్ బెనర్జీ, అశిష్ విద్యార్ది నటించిన `వేద` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
నికిల్ అద్వానీ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించి జనాల్లోకి వదిలాడు. అయితే ఈ సినిమా తొలి షోతోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. విమర్శకులు ఎక్కు పెట్టారు. రొటీన్ యాక్షన్ సినిమా చేసి జాన్ మరోసారి భంగపట్టాడు అంటూ విమర్శలు ఎదుర్కున్నాడు. ఈ సినిమా మొత్తంగా 11 కోట్ల వసూళ్లను సాధించింది. ఇవి కేవలం గురు, శుక్ర, శనివారం లెక్కల్లో. తాజాగా ఈ చిత్ర యూనిట్ ముంబైలో గ్రాండ్ గా సక్సెస్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంది.
విజయం సాధించినందుకు అంతా చిల్ అవుతున్నామంటూ సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టి మరీ చెప్పారు. అందులో జాన్ అబ్రహం తో పాటు అంతా ఉన్నారు. ఇది చూసిన నెటి జనులు దుమ్మెత్తి పోస్తున్నారు. ప్లాప్ సినిమా సక్సెస్ అయిందని జనాల్ని ఏమార్చుతున్నారా? ప్లాప్ సినిమా హిట్ అని చెప్పి ప్రచారం చేసుకుంటారా? అంటూ మండిపడుతున్నారు.