లవ్‌యాపా: ఖుషీకి బాయ్‌ఫ్రెండ్ కాంప్లిమెంట్

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ నటించిన `లవ్‌యాపా` ఈరోజు సినిమా హాళ్లలో విడుదలైంది.

Update: 2025-02-07 18:30 GMT

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి రెండో కుమార్తె ఖుషీ కపూర్ నటించిన `లవ్‌యాపా` ఈరోజు సినిమా హాళ్లలో విడుదలైంది. ఇప్ప‌టికే అక్క జాన్వి క‌పూర్ త‌న సోద‌రి న‌ట‌న‌కు కాంప్లిమెంట్లు ఇచ్చింది. ఆ తర్వాత, ఖుషీకి ఎవ‌రి నుంచి కాంప్లిమెంట్ ద‌క్కింది? అంటే.. బాయ్‌ఫ్రెండ్ వేదంగ్ రైనా నుండి ముద్దు ముద్దుగా మురిపెంగా ప్రశంసలు అందుకుంది. ఖుషీ అందమైన ఫోటోగ్రాఫ్ ఒక‌టి షేర్ చేసిన వేదంగ్ త‌ప్ప‌క చూడాల్సిన సినిమా ఇది అని ప్ర‌శంసించారు. ఖుషీ క‌పూర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో హార్ట్ ఈమోజీతో పోస్ట్‌ను తిరిగి షేర్ చేసింది.

విడుదలకు ముందు లవ్‌యాపా నిర్మాతలు సెల‌బ్రిటీల కోసం ప్రత్యేక ప్రదర్శనలను నిర్వహించారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అలియా భట్, రణబీర్ కపూర్, రేఖ, ధర్మేంద్ర త‌దిత‌రులు ప్రివ్యూని వీక్షించారు. ఇప్ప‌టికే నిర్మాత

కరణ్ జోహార్ కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు. 2025లో తొలి ప్రేమకథ విజయగాథ అని పొగిడేశాడు ధ‌ర్మాధినేత‌. సినిమాలోని అన్ని పాత్రలతో ప్రేక్ష‌కులు ప్రేమలో పడతారు. మాయాజాలం చేసే చ‌క్క‌ని పాత్రలను ఆరాధిస్తారు అని పొగిడేశాడు.

ఖుషీ కపూర్ 2023లో నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ `ది ఆర్చీస్‌` వెబ్ సిరీస్‌లో సుహానా ఖాన్, అగస్త్య నందాతో కలిసి ఆరంగేట్రం చేసింది. ఈ చిత్రానికి జోయా అక్తర్ దర్శకత్వం వహించారు. జునైద్ ఖాన్ నెట్‌ఫ్లిక్స్ చిత్రం మహారాజ్‌తో అరంగేట్రం చేశారు. ఇప్పుడు ఖుషి-జునైద్ ఇద్ద‌రికీ కీల‌క‌మైన సినిమా.

10 సెక‌న్ల‌లోనే అంచ‌నా వేయ‌కండి:

తాజాగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దుష్ప‌రిణామాల గురించి ఖుషి క‌పూర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేసారు. డిజిట‌ల్ లో ఏదైనా వీడియోని చూసి అది మంచా చెడా అనేది నిర్ణ‌యించేస్తుంటాం. 10 సెక‌న్ల ఇన్ స్టా రీల్ చూసి ఎవ‌రినీ అంచ‌నా వేసేయ‌కండి .. నిజానికి వారు ఏం చేస్తారో, ఎలా ఉంటారో మీకు నిజంగా తెలియ‌దు. అయినా వెంట‌నే నిర్ణ‌యానికి వ‌చ్చేస్తారు. ఇది స‌రి కాద‌ని ఖుషీ అన్నారు. ఏఐ తో ఎన్ని స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయో చూస్తూనే ఉన్నామ‌ని కూడా ఖుషి అన్నారు. సాంకేతిక‌త‌ను మంచి కోసం మాత్ర‌మే ఉప‌యోగించుకోవాల‌ని అన్నారు.

Tags:    

Similar News