అనిల్ - వెంకీ.. దిల్ రాజు పర్ఫెక్ట్ బిజినెస్ ప్లాన్?

రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో వరుసగా కమర్షియల్ సక్సెస్ లతో దూసుకుపోతున్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.

Update: 2024-09-17 04:55 GMT

రాజమౌళి తర్వాత టాలీవుడ్ లో వరుసగా కమర్షియల్ సక్సెస్ లతో దూసుకుపోతున్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. గత ఏడాది ‘భగవంత్ కేసరి’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న మూడో సినిమా కావడం విశేషం. ఇది వరకు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ అయ్యాయి.

అయితే ఆ రెండు చిత్రాలు మల్టీ స్టారర్ మూవీస్ గా తెరకెక్కాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడితో చేస్తోన్న సినిమాలో వెంకటేష్ సోలో హీరోగా ఉన్నారు. క్రైమ్ కామెడీ జోనర్ లో ఈ సినిమా ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది. దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ని ఈ సినిమాకి పెట్టినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోందంట.

ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యిందని సమాచారం. నవంబర్ నెలాఖరుకి మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. తరువాత వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా దిల్ రాజు ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. అనిల్ రావిపూడి షూటింగ్ శరవేగంగా పూర్తి చేసేస్తూ ఉండటంతో రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అనుకుంటున్నారు.

దిల్ రాజు ప్రొడక్షన్ వేల్యూ, అనిల్ రావిపూడి కమర్షియల్ బ్రాండ్ ఇమేజ్ కారణంగా ఇప్పటికే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రైట్స్ కోసం మంచి ఆఫర్స్ వస్తున్నాయంట. అయితే మూవీ షూటింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ సినిమాకి సంబందించిన అప్డేట్స్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. వీటితో మూవీపై బజ్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ గా సినిమాకి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు నాన్ థీయాట్రికల్ రైట్స్ డీల్ మాట్లాడుకోవాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తుంటే రిలీజ్ కి ముందే దిల్ రాజు టేబుల్ ప్రాఫిట్ ని అందుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. డిస్టిబ్యూటర్స్, బయ్యర్ల నుంచి భారీగానే ఆఫర్స్ వస్తాయని భావిస్తున్నారు. ఈ సినిమాతో మరో సాలిడ్ కమర్షియల్ సక్సెస్ ని అందుకోవాలని అనిల్ రావిపూడి చూస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కి డోకా ఉండదనే అభిప్రాయం పబ్లిక్ లో ఉంది. అందుకే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాపై మంచి హైప్ నెలకొంది.

Tags:    

Similar News