వెంకీ ష్యూర్ షాట్ హ్యాట్రిక్ ప్లాన్..!

విక్టరీ వెంకటేష్ సైంధవ్ నిరుత్సాహ పరచడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూపర్ హిట్ డైరెక్టర్ అనీల్ రావిపుడితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు

Update: 2024-11-04 13:30 GMT

విక్టరీ వెంకటేష్ సైంధవ్ నిరుత్సాహ పరచడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సూపర్ హిట్ డైరెక్టర్ అనీల్ రావిపుడితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. వెంకటేష్, అనీల్ రావిపుడి కలిసి F2, F3 సినిమాలు చేశారు. రెండు సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. ఐతే ఈసారి ఎఫ్ సీరీస్ తో కాకుండా సంక్రాంతికి వస్తున్నాం అనే క్రేజీ టైటిల్ తో వస్తున్నారు. 2025 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా లో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

కమర్షియల్ సినిమాల్లో కామెడీని మిక్స్ చేసి శ్రీను వైట్ల తర్వాత అనీల్ రావిపుడి సూపర్ సక్సెస్ లు అందుకుంటున్నారు. భగవంత్ కేసరి తర్వాత వెంకటేష్ తో సినిమా ఫిక్స్ చేసుకున్న అనీల్ రావిపుడి హిట్ టార్గెట్ తోనే సినిమా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ కామెడీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు. హీరో, హీరోయిన్స్ మధ్య కన్ ఫ్యూజ్ కామెడీ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్విస్తుందని అంటున్నారు.

వెంకటేష్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఐతే ఈ సినిమాలో కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా విక్టరీ వెంకటేష్ మార్క్ ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. ఈ సీన్స్ ఆడియన్స్ ని కచ్చితంగా టచ్ చేస్తాయని చెబుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ సినిమాతో వెంకటేష్ తిరిగి సూపర్ హిట్ ట్రాక్ ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. అనీల్ రావిపుడి, వెంకటేష్ సూపర్ హిట్ కాంబో కాబట్టి రిజల్ట్ కూడా అదే హిట్ ఆశిస్తున్నారు.

వెంకటేష్ కూడా ఈసారి పక్కా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ కొట్టిన మీనాక్షి చౌదరి కూడా ఈ సినిమాకు ప్లస్ కానుని. ఐతే సంక్రాంతికి దిల్ రాజు నిర్మించిన భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం కూడా రాబోతుంది. ఒక నిర్మాత నుంచి రెండు సినిమాలు ఒకే సీజన్ లో మూడు నాలుగు రోజుల గ్యాప్ తో రిలీజ్ అవ్వడం పెద్ద రిస్కే.. కానీ ఈసారి సంక్రాంతికి దిల్ రాజు తన బ్యానర్ సత్తా ఏంటో చాటి చెప్పాలని చూస్తున్నారు.

రెండు సినిమాలు రెండు డిఫరెంట్ జోనర్స్.. సంక్రాంతికి వెంకటేష్ నుంచి ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తే పక్కా హిట్ అనే లెక్కలతోనే ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నారు దిల్ రాజు.

Tags:    

Similar News