హీరోహీరోయిన్ల మధ్య 30ఏళ్ల గ్యాప్.. కానీ..

ఏ సినిమాలో అయినా.. హీరోహీరోయిన్ల పెయిర్ చాలా ఇంపార్టెంట్ అన్న విషయం తెలిసిందే.

Update: 2024-07-05 03:55 GMT

ఏ సినిమాలో అయినా.. హీరోహీరోయిన్ల పెయిర్ చాలా ఇంపార్టెంట్ అన్న విషయం తెలిసిందే. లీడ్ రోల్స్ మధ్య కెమిస్ట్రీ పండితే.. ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. దీంతో మేకర్స్.. లీడ్స్ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకుని ఎంపిక చేసుకుంటారు. అయితే కొన్నిసార్లు హీరోహీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది అనేక టాలీవుడ్ సినిమాల్లో కనిపించింది. ఇప్పుడు ఈ అంశం మరోసారి చర్చల్లోకి వచ్చింది.

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్... మెల్లగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సంక్రాంతికి సైంధవ్ మూవీతో వచ్చిన ఆయన.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయారు. కాస్త గ్యాప్ తీసుకున్న వెంకీ.. ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడితో వర్క్ చేయనున్నారు. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన F2, F3 సినిమాలు హిట్ అవ్వడంతో అప్ కమింగ్ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

ఈ మూవీలో మీనాక్షీ చౌదరితో పాటు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య, ప్రేయసిగా మీనాక్షి కనిపించనున్నారు. అయితే ఇప్పుడు హీరోహీరోయిన్ల మధ్య ఏజ్ గ్యాప్ చర్చనీయాంశంగా మారింది. వెంకటేష్ కన్నా మీనాక్షి 37 ఏళ్లు చిన్న కాగా.. ఐశ్వర్య, వెంకీ మధ్య 30 ఏళ్ల గ్యాప్ ఉంది.

నిజం చెప్పాలంటే.. నార్మల్ గా ఏ దంపతుల మధ్య కూడా అంత ఏజ్ గ్యాప్ ఉండదు. కానీ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ వేర్వేరు అని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. అయితే వెంకటేష్ వయసు ఎక్కువ అయినా.. ఇప్పటికీ ఫిట్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తారు. కాబట్టి వెంకీ, మీనాక్షి మధ్య కెమిస్ట్రీ బాగానే పండే అవకాశం ఉంది. కొందరు కాస్త అసౌకర్యంగా భావించినా.. అనిల్ రావిపూడి క్యారక్టరైజేషన్ సరైన దిశగా రాసుకుంటే చాలు అని చెప్పాలి.

ఏదేమైనా ఏజ్ గ్యాప్ పక్కన పెడితే.. మీనాక్షి, ఐశ్వర్యకు ఇది మంచి ఆఫర్. ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించిన మీనాక్షి.. పెద్ద ఆఫర్ కొట్టేసింది. కోలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఐశ్వర్య.. తెలుగులో కూడా మంచి ఛాన్స్ కొట్టేసినట్లే. ఈ సినిమా హిట్ అయితే ఇద్దరి హీరోయిన్లకు మరిన్ని ఆఫర్లు వస్తాయి. డిఫరెంట్ జోనర్ తో వచ్చే సంక్రాంతికి రానున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News

eac