బన్నీ సరే... వెంకటేష్ ప్రచారం చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి?
నంద్యాల అభ్యర్ధి తరుపున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ దిగడం ఎంతటి! చర్చనీయాంశంగా మారిందో తెలిసిందే.
ఈసారి ఏపీ ఏన్నికల్లో తారాలోకం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కోసం మెగా కుటుంబ సభ్యులొచ్చి ప్రయాచంర చేయడం, వాళ్లతో పాటు జబర్దస్థ్ ఆర్టిస్టులు, సిరియల్ ఆర్టిస్టులు రంగంలోకి దిగడంతో పిఠాపురం రంగుల మయంగా మారింది. గతంలో చిరంజీవి పోటీ చేసినప్పుడు ఇలాంటి వాతావరణం కనిపించింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి సన్నివేశం 2024లో రిపీట్ అయింది. నంద్యాల అభ్యర్ధి తరుపున ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ దిగడం ఎంతటి! చర్చనీయాంశంగా మారిందో తెలిసిందే.
బన్నీ ఇలా ప్రచారం చేయడం కొత్తేం కాదు. గతంలో అనకాపల్లీ ఎంపీగాఅల్లు అరవింద్ పోటీ చేసిన సమయంలో ఆ నియోజకవర్గంలో పెద్ద ఎత్తన ప్రచారం చేసాడు. అయితే ఎప్పుడూ రాజకీయాలవైపు చూడని విక్టరీ వెంకటేష్ కూడా ఈసారి తన బంధువుల కోసం రంగంలోకి దిగడం విశేషం. అలాగే ఆయన ప్రచారం చేసిన రెండు చోట్లా ఆయన అభ్యర్ధులు గెలవడం అంతకు మించిన విశేషం. తెలంగాణ ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో వెంకటేష్ వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసారు.
రఘురాంరెడ్డి కోసం వెంకటేష్, ఆయన కుమార్తె ఆశ్రిత స్వయంగా వచ్చి ప్రచారంలో పాల్గొన్నారు. రఘురాంరెడ్డికి ఏకంగా నాలుగు లక్షలకుపైగా మెజార్టీ వచ్చింది. వెంకటేష్ కుమార్తె అశ్రితను రామసహాయం రఘరాంరెడ్డి తనయు డికి ఇచ్చి వివాహం చేయడంతోనే ఇది సాధ్యమైంది. దీంతో వెంకటేష్ కుటుంబం సంతోషంలో మునిగి తేలుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నుంచి నుంచి పోటీ చేసిన కామినేని శ్రీనివాస్ కోసం కూడా వెంకటేష్ స్వయంగా వచ్చి కైకలూరులో ప్రచారం చేశారు.
కామినేని కూడా మంచి మెజార్టీతో గెలిచారు. గతంలో కామినేని కోసం రామానాయుడు కూడా ప్రచారం చేశారు. కామినేని శ్రీనివాస్ కు, వెంకటేష్ భార్యకు బంధుత్వం ఉంది. ఆ రకంగా వెంకీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. అలా ఈసారి తెలంగాణ-ఏపీ ఎన్నికల్లో వెంకటేష్ కీలక భాగస్వామిగా మారారు. మరి భవిష్యత్ లో ఆయన కూడా రాజకీయాల్లోకి దిగుతారేమో చూడాలి.