వెంకీ మామ ఒక్కడే వెనకపడ్డాడెందుకు..?

వెంకటేష్ సినిమా హిట్ టాక్ వస్తే కేవలం ఆ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా భారీగా తరలివచ్చి సినిమా చూస్తారు.

Update: 2024-06-21 14:28 GMT

టాలీవుడ్ సీనియర్ హీరోలు యువ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఐతే వారిలో సక్సెస్ లు కొంతమందికే వస్తున్నాయి. సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నట సింహం బాలకృష్ణ ఇద్దరు ఒక రేంజ్ లో ఫాం కొనసాగిస్తున్నారు. చిరు అన్నా కాస్త అటు ఇటుగా ఉన్నాడు కానీ బాలయ్య సినిమా చేస్తే హిట్ అనేలా ఉంది. మరోపక్క కింగ్ నాగార్జున కూడా పర్వాలేదు అనిపించుకుంటున్నాడు. ఎటొచ్చి సీనియర్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒక్కటే వెనకపడ్డాడు.

తన మార్క్ ఎంటర్టైనర్ సినిమాలుగా చేసిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలు హిట్ అయినా కాస్త డిఫరెంట్ గా చేద్దాం అని ప్రయత్నించిన సైంధవ్ సినిమాను ఎవరు పట్టించుకోలేదు. సైంధవ్ ఫ్లాప్ ఎవరిది తప్పు అన్నది పక్కన పెడితే ఆ సినిమాకు కనీసం వెంకీ ఫ్యాన్స్ కూడా చూసే పరిస్థితి కనిపించలేదు. సీనియర్ హీరోల్లో ఎక్కువ హిట్ పర్సెంటేజ్ ఉన్న వెంకటేష్ ఇప్పుడు కెరీర్ లో ఎలాంటి సినిమా చేయాలన్న కన్ ఫ్యూజన్ లో పడిపోయాడు.

సైంధవ్ ఇచ్చిన షాక్ వల్ల కాస్త గ్యాప్ తీసుకున్న వెంకటేష్ ప్రస్తుతం మళ్లీ తనకు రెండు హిట్లు ఇచ్చిన అనిల్ రావిపుడి డైరెక్షన్ లోనే సినిమా లాక్ చేసుకున్నాడు. ఈ సినిమా ఎఫ్2, ఎఫ్3 తరహాలో కాకుండా ఒక ఎమోషనల్ సబ్జెక్ట్ తో వస్తుందని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాగా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. ఈ సినిమా పక్కా హిట్ టార్గెట్ తో ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

వెంకటేష్ సినిమా హిట్ టాక్ వస్తే కేవలం ఆ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా భారీగా తరలివచ్చి సినిమా చూస్తారు. తన మార్క్ ఎంటర్టైనింగ్ సినిమాలతో ఎన్నో రికార్డులు సృష్టించిన వెంకటేష్ ఇక నుంచి కెరీర్ మీద మరింత ఫోకస్ తో పనిచేయనున్నారని తెలుస్తుంది. వెంకటేష్ లాండ్ మార్క్ మూవీ 75వ సినిమా సైంధవ్ నిరాశ మిగల్చగా మళ్లీ ఆ మిస్టేక్ జరగకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. సినిమానే కాదు నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు సీజన్ 2 కోసం కూడా వెంకటేష్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. రానా నాయుడు 1 తోనే రచ్చ రచ్చ చేసిన వెంకటేష్ సీజన్ 2 లో నెక్స్ట్ లెవెల్ లో ఆయన బోల్డ్ నెస్ ఉండబోతుందని తెలుస్తుంది.

Tags:    

Similar News