సలార్ గోల తట్టుకోలేకపోయిన C/o కంచరపాలెం దర్శకుడు

తాజాగా తన ఎక్స్(అప్పటి ట్విట్టర్) అకౌంట్ను డీయాక్టివేట్ చేశారు. దీంతో సోషల్మీడియా ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.

Update: 2023-12-20 06:43 GMT

డెఫరెంట్ కాన్సెప్ట్లతో కేరాఫ్ కంచరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలు తెరకెక్కించి సినీప్రియులను మెప్పించిన దర్శకుడు వెంకటేశ్ మహా.. ఈమధ్య కాలంలో తెగ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే తనపై ట్రోల్స్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వెంకటేశ్ మహా.. తాజాగా తన ఎక్స్(అప్పటి ట్విట్టర్) అకౌంట్ను డీయాక్టివేట్ చేశారు. దీంతో సోషల్మీడియా ఈ విషయం హాట్ టాపిక్గా మారింది.

బాలీవుడ్ బాద్షా నటించిన డంకీ సినిమాపై దర్శకుడు వెంకటేశ్ మహా ఇటీవలే ట్వీట్ చేశారు. తాను డంకీ సినిమా చూసేందుకు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు. సెన్సార్ బోర్డ్ సభ్యులంతా డంకీ సినిమాపై ప్రశంసల కురిపించినట్లు విన్నానని తెలిపారు. అదే నిజమైతే ఫ్యాన్స్ మరో సూపర్ మూవీని ఎంజాయ్ చేస్తారని అన్నారు.

అయితే వెంకటేశ్ డంకీ సినిమా గురించి పోస్ట్ చేసిన తర్వాత నెటిజన్లు మళ్లీ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సలార్ మూవీని వెంకటేశ్ మహా తక్కువ చేశారని కొందరు నెటిజన్లు ఆరోపించారు. దీంతో వాళ్లకు మరో పోస్ట్ ద్వారా వెంకటేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సలార్‌ ట్రైలర్‌ విడుదలైందని వారి కామెంట్లు చూశాకే అర్థమైందని, ట్రైలర్ చాలా బాగుందని ట్వీట్ చేశారు.

డంకీ మూవీపై పెట్టిన పోస్ట్‌ను కొందరు వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకున్నారని వెంకటేశ్ మహా క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్‌ సినిమాను తానేం తక్కువ చేయలేదని, ప్రతి విషయానికి అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని రాసుకొచ్చారు. ఇంతకు మందుకు కూడా ఇది చెప్పానని గుర్తుచేశారు. అయితే ఇలా పోస్ట్ పెట్టిన కాసేపటికే వెంకటేశ్ తన అకౌంట్ను డీయాక్టివేట్ చేశారు. అలా ఎందుకు చేశారో కారణం కూడా తెలియదు. ఇప్పుడు సోషల్మీడియాలో వెంకటేశ్ అకౌంట్ డీయాక్టివేషన్ కోసం నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

కొన్నిరోజుల క్రితం... నాని హాయ్ నాన్న సినిమా తనకు ఎంతో నచ్చిందని వెంకటేశ్ మహా ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్కు ఓ నెటిజన్ రెండు సినిమాలు తీసి కేజీఎఫ్ మీద కామెంట్లు చేశారని విమర్శించారు. ఊరుకుంటున్నాం కదా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇంకా అస్సలు ఊరుకోను వెంకటేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అంతకుముందు యశ్ నటించిన కేజీఎఫ్పై ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో తీవ్రదుమారం రేపిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News